Horoscope Today 18 February 2025: ఈ రాశులవారు తప్పుడు సలహాలు పాటించి నష్టపోతారు - మనసులో చెడు ఆలోచనలతో ఉంటారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 18 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు నూతన ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు మంచిది. ప్రేమ వివాహం గురించి కుటుంబంతో చర్చిస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పర్యటనకు వళ్లేందుకు ఇదే మంచి సమయం.
వృషభ రాశి
పిల్లల పురోగతితో ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం లేనిచోట్ వ్యర్థ డిస్కషన్స్ వద్దు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి
ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉన్నత విద్యలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి
చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో పూర్తికావు. ఆర్థికంగా నష్టపోతారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనుల్లో ఆలస్యం అవుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ అవసరాలపై శ్రద్ధ వహించండి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
Also Read: ఫిబ్రవరి ఆరంభం నుంచి ఏప్రిల్ 18 వరకూ ఈ 4 రాశులవారిపై శని తీవ్ర ప్రభావం!
సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు బావుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపార ప్రణాళికలలో విజయం సాధిస్తారు. మీరు చాలా ఎదురుచూస్తున్న రచనలలో విజయం సాధిస్తారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఆ
కన్యా రాశి
ఈ రోజు చాలా మంది కొత్త వ్యక్తులను కలవవలసి ఉంటుంది. మీరు పనిచేసే ప్రదేశంలో పై అధికారులతో అనవసర చర్చ ఏర్పడొచ్చు. హార్ట్ వర్క్ చేసే మీ తీరు మార్చుకోవద్దు..భవిష్యత్ లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు సన్నిహితులు అనుకున్న వ్యక్తులతో సంబంధాల విషయంలో ఇబ్బందులుండొచ్చు
తులా రాశి
ఈ రోజు మీరు చేపట్టిన పని విజయవంతమవుతుంది. జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి బహుమతులు లభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నవారు పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారలో లాభాలు తగ్గే అవకాశం ఉంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.
వృశ్చిక రాశి
గతంలో చేసిన తప్పులను ఇప్పుడు పునరావృతం చేయవద్దు. కోపం కారణంగా మీరు చేపట్టిన పని నాణ్యత తగ్గుతుంది. సన్నిహితులతో విభేదాలు ఏర్పడే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోండి. ప్రయాణంలో ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి
ఈ రోజు శుభ కార్యానికి హాజరవుతారు. ఆనందం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. ప్రేమ వ్యవహారాలను ఆనందిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ తెలివితేటలకు తగిన మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!
మకర రాశి
ఈ రోజు మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఏదైనా శుభకార్యం నిర్వహణ గురించి ఆలోచిస్తారు. ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. మూలధనం పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.
కుంభ రాశి
విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారికి ఈ రోజు శుభదినం. పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఏదైనా తీవ్రమైన సమస్య గురించి చర్చిస్తారు. మీరు జీవిత భాగస్వామితో దూరప్రాంతం ప్రయాణం చేయాల్సి వస్తుంది.
మీన రాశి
ఈ రోజు మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. తప్పుడు వ్యక్తుల సలహాలు పాటించడం మీ వ్యాపారంలో నష్టాన్ని కలిగిస్తుంది. పాత తప్పులను అంగీకరించండి..దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. మీ ప్రవర్తన సహోద్యోగుల పట్ల మంచిగా ఉంచేలా వ్యవహరించండి. మనస్సులో చెడు భావన ఉంటుంది.
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.





















