Shani Gochar 2025: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!
Shani Nakshtra Gochar 2025: శని సంచారం జాతకాన్ని మలుపుతిప్పుతుందంటారు. అయితే శని అన్నీ చెడు ఫలితాలనే ఇవ్వడు మంచి కూడా చేస్తాడు..ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ రాశులవారికి అదృష్టం మొదలువుతుంది

Shani Nakshtra Gochar 2025 : శని దేవుడు 27 ఏళ్ల తర్వాత మీన రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ రాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలుంటాయి. ఈ రాశిలో శనిసంచరించే రెండున్నరేళ్లలో ఈ మూడు నక్షత్రాల్లోనూ శనిగోచారం ఉంటుంది. రాశిలో శని సంచారం 12 రాశులవారిపై అనుకూల, ప్రతికూల,మిశ్రమ ప్రభావాలను ఎలా చూపిస్తుందో..నక్షత్రం మారినప్పుడు కూడా ఆయా రాశులవారిపై మంచి చెడు ఫలితాలుంటాయి.
రెండున్నరేళ్లకోసారి రాశి పరివర్తనం చెందే శనిని మందరుడు అంటారు. అంటే నెమ్మదిగా సంచరించేవాడు అని అర్థం. అయితే ప్రస్తుతం కుంభంలో ఉన్న శని ఏప్రిల్ 18 నుంచి మీనంలో అడుగుపెడతాడు. అప్పటి నుంచి అన్ని రాశులపైనా ఈ ప్రభావం ఉంటుంది. కొన్ని రాశులవారికి శని నుంచి ఉపశమనం లభిస్తే..మరికొన్ని రాశులవారికి శని ప్రభావం మొదలవుతుంది. ఇంకొన్ని రాశులవారికి అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అయితే రాశుల మార్పుతో పాటూ నక్షత్రం మార్పు ప్రభావం కూడా ఉంటుంది.
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
శని అంటే చెడు చేసేవాడు మాత్రమే కాదు..ఊహించని మంచి కూడా చేస్తాడు. మీనంలోకి శని ప్రవేశించిన తర్వాత ఎప్రిల్ నెలాఖరున ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ సమయంలో మూడు రాశులవారు విశేష ప్రయోజనాలు పొందుతారు.
వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవేశించిన తర్వాత ఈ రాశివారికి అదృష్టం మొదలవుతుంది. దీర్ఘకాలంగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో కలిసొస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు సమయం మంచింది. ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన వాహనం కొంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రతిక్షణం ఆహ్లాదకరంగా గడుపుతారు.
మిథున రాశి (మృగశిర 3,4 పాదాలు ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
శని దేవుడు మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించిన తర్వాత మిథున రాశివారికి ఊహంచని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయవనరులు పెరుగుతాయి. డబ్బు కూడబెట్టడంలో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనలున్నీ పూర్తవుతాయి. ఉద్యోగం మారాలి అనుకున్నా, నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా సమయం కలిసొస్తుంది. ఆర్థికంగా అడుగులు ముందుకు పడతాయి.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
తులా రాశి (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
శని దేవుడి రాశి మార్పులు, ఉత్రరా భాద్ర నక్షత్రంలో సంచారం తులా రాశివారి జీవితంలో ఉత్తమ ఫలితాలను తీసుకొస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. మీ రాశి నుంచి ఆరో స్థానంలో శని సంచారం కారణంగా మీరున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అనుకోని ఆస్తి కలిసొస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

