India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
భారత్-న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీను చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టి మంచి జోష్ తో ముందుకు సాగుతున్న టీమ్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఈ వన్డే సిరీస్‌కు దూరమైనట్టుగా తెలుస్తోంది. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ తగిలి రిషభ్ పంత్ కు గాయమైంది. అతన్ని గేమ్ నుంచి తపించారని తెలుస్తుంది.
కానీ పంత్ గాయంపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ పంత్ ఆడలేకపోతే.. ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది. పంత్‌కు బ్యాకప్‌గా కేఎల్ రాహుల్ ( KL Rahul ) ఉన్నాడు. అలాగే ఇషాన్ కిషన్‌ను ( Ishan Kishan ) తీసుకునే అవకాశం ఉంది.
గాయాలు, ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. ఓపెనర్లుగా గిల్-రోహిత్ దిగనుండగా, వన్‌డౌన్‌లో కోహ్లీ తర్వాత శ్రేయాస్ రానున్నారు. టీ20 వరల్డ్‌కప్ కోసమని బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. దాంతో సిరాజ్, హర్షిత్, అర్షదీప్ సింగ్ పై పేస్ బాధ్యత పడనుంది. కుల్దీప్, జడేజా, సుందర్ స్పిన్ బౌలర్స్ గా కీలకం కానున్నారు.





















