Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!
భారత్ vs న్యూజిలాండ్ ( India vs New Zealand ) సిరీస్ ప్రారంభమవుతుంది. మొదటి వన్డే మ్యాచ్ లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ( Virat Kohli ), రోహిత్ శర్మ ( Rohit Sharma )పైనే అందరి దృష్టి ఉంది.
అద్భుతమైన ఫామ్‌తో విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో 5 రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌పై 33 ఇన్నింగ్స్‌లలో 1657 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై అత్యధిక ODI పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. టెండూల్కర్‌ను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి 94 పరుగులు కావాలి. న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీల రికార్డును తన పేరిట లిఖించుకోవాలంటే విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేయాలి.
విరాట్ కోహ్లీ 25 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర తర్వాత 28,000 పరుగులు పూర్తి చేసిన మూడవ క్రికెటర్ అవుతాడు. కోహ్లీ కనుక మరో సెంచరీ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై 10 సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలుస్తాడు.





















