Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) రికార్డుల మీద రికార్డులు బద్దలుగొడుతూనే ఉన్నాడు. ఎలాంటి ఫార్మాట్ అయినా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా స్కాట్లాండ్ ( India vs Scotland U19 ) తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు.
త్వరలో అండర్ 19 వరల్డ్ కప్ 2026 ( Under 19 World Cup 2026 ) ప్రారంభం కానుంది. వార్మప్ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఓపెనర్ గా వచ్చిన వైభవ్ కేవలం 50 బంతుల్లోనే 96 పరుగులు చేసాడు. కానీ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 9 ఫోర్లు, 7 భారీ సిక్స్‌లు బాదాడు. భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన దక్షిణాఫ్రికా ( South Africa vs India ) సిరీస్‌లో 74 బంతుల్లోనే 127 పరుగులు చేశాడు. అండర్-19 వరల్డ్ కప్ లో వైభవ్ సూర్యవంశీ తన ప్రదర్శనతో రికార్డులు తిరగరాస్తాడని ఫ్యాన్స్ అంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.





















