MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
WPL 2026 లో భాగంగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ( Mumbai Indians vs Delhi Capitals ) మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై ఢిల్లీను 50 పరుగుల తేడాతో ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur ) 74 పరుగులు చేసి తమ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఛేజింగ్ కు దిగిన ఢిల్లీ 145 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదటి మ్యాచ్ లో RCB చేతిలో 1 పరుగు తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ .. ఢిల్లీపై భారీ విజయాన్ని అందుకుంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 42 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్ 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదింది. నాట్ స్కైవర్ బ్రంట్‌తో 66 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ షెఫాలీ వర్మ రాణించలేకపోయింది. షెఫాలి కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్ ప్రారంభం నుంచే వరుసగా వికెట్స్ పడుతుండడంతో ఢిల్లీ క్యాప్టిల్స్ ఓటిమిని ఎదుర్కోక తప్పలేదు.





















