అన్వేషించండి

Venus conjunct Saturn in Pisces 2025: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!

Shukra Gochar 2025: కుంభ రాశిలో సంచరించిన శుక్రుడు జనవరి 28 మంగళవారం మీన రాశిలోకి ప్రవేశించాడు. ఈ సంచారం 12 రాశుల్లో ఎవరికి మంచి చేస్తుంది.. ఎవరిని అప్రమత్తంగా ఉండమంటోందో చూద్దాం..

Horoscopes for Venus in Pisces 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అందం, కళ, ఆనందం, శ్రేయస్సుకి మూలం అయిన గ్రహం. జనవరి 28 నుంచి మీనంలోకి ప్రవేశిస్తుంది.. మార్చి 02 వరకూ ఇదే రాశిలో ఉంటుంది. ఈ సమయంలో శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం మీ రాశిపై ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. 
 
మేష రాశి

మీనంలో శుక్రుడి సంచారం మీ కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. కార్యాలయంలో మీకు పెద్ద బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి

వృషభ రాశి

శుక్రుడి సంచారం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. మంచి ఉద్యోగం సాధించాలన్న యువత కల నెరవేరుతుంది. దాంపత్య జీవితంలో పరస్పర సామరస్యం చాలా బాగుంటుంది. 

Also Read: ఈ వారం ఈ రాశులవారు బాగా సంపాదిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు!

మిథున రాశి 

మీ రాశి నుంచి పదో స్థానంలో శుక్రుడి సంచారం మీకు అంత మంచి ఫలితాలను అందివ్వడం లేదు. ఈ సమయంలో మీరు చేసే పని పట్ల కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. కార్యాలయంలో విజయాన్ని సాధించడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపార సంస్థల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. ప్రేమ సంబంధాలలో తొందరపడకండి

కర్కాటక రాశి 

మీన రాశిలో శుక్ర సంచారం మీకు మంచి చేస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ వివాహాలకు కుటుంబాల నుంచి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకోసం డబ్బు వెచ్చిస్తారు. ఇతరులపై ఎక్కువ ఆధారపడొద్దు. నూతన పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు.  రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి 

సింహ రాశి

జనవరి 28 నుంచి మార్చి 2 వరకూ శుక్రుడి ప్రభావంతో మీరు శారీరకంగా మానసికంగా కొంత బలహీనంగా అనిపించవచ్చు. చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండండి. మీరు అనుకున్న పని పూర్తిగా విజయవంతమవుతుంది. మీరు నమ్మినవారే మీకు ద్రోహం చేస్తారు. 

Also Read: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 02 వరకూ ఈ వారం ఈ 4 రాశులవారికి ఆర్థికంగా కలిసొస్తుంది!
 
కన్యా రాశి

శుక్రుడు మీకు ఆర్థిక లాభాలు అందిస్తాడు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సమన్వయం బావుంటుంది. వ్యాపారంలో పెద్ద మార్పులు చేర్పులు చేయవద్దు. కొత్త మూలల నుంచి ధనం పొందుతారు. ప్రేమ సంబంధాలు కలిసొచ్చే సమయం ఇది.

తులా రాశి

మీ రాశి నుంచి ఆరో స్థానంలో శుక్ర సంచారం ఉంటుంది.  ఈ సమయంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మీ పనితీరులో మార్పులు చేయాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి సహకారం పొందుతారు. నూతన ఉద్యోగం వెతుక్కుంటున్నవారు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి

మీనంలో శుక్రుడి రాశి పరివర్తనం మీ పనితీరును మెరుగుపరుస్తుంది. కుటుంబంలో స్త్రీల విషయంలో కొన్ని చికాకులుంటాయి. పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు పొందుతారు. పిల్లల పురోభివృద్ధితో మనసు ఆనందంగా ఉంటుంది.

Also Read: ఈ వారం ఈ 4 రాశులవారు వృత్తి, ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు!

ధనుస్సు రాశి 

మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శుక్రుడి సంచారం మీ కుటుంబంలో ఆనందాన్నిస్తుంది. ఆస్తి కొనుగోలు దిశగా అడుగులు వేసేవారు జాగ్రత్తగా ఆలోచించి దిగండి. నిరుద్యోగులు కెరీర్లో లాభపడతారు. దూరప్రయాణాలు కలిసొస్తాయి. కళలు, సాహిత్యంపై ఆసక్తి పెరుగుతుంది. 

మకర రాశి

శుక్రుడి రాశి పరివర్తనం మీరున్న రంగంలో మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.  డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లవచ్చు. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. 

కుంభ రాశి 

మీ రాశి నుంచి మీనంలోకి ప్రవేశించాడు శుక్రుడు. ఫలితంగా జనవరి 28 నుంచి మార్చి 02 వరకూ మీరు ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ సమాచారం వింటారు. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. స్నేహితులపై ఎక్కువగా ఆధారపడవద్దు.
 
మీన రాశి

మీ రాశిలో శక్రుడి సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో అవివాహితులు పెళ్లి విషయంలో ఓ అడుగు వెనక్కు వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఉద్యోగులు, వ్యాపారులు కష్టపడితే కానీ మంచి  ఫలితాలు సాధించలేరు.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Lionel Messi Statue :మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్‌ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్‌ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
Embed widget