అన్వేషించండి

Weekly Horoscope 27 January to 2 February 2025 : ఈ వారం ఈ 4 రాశులవారు వృత్తి, ఉద్యోగాల్లో మంచి పురోగతి సాధిస్తారు!

Weekly Horoscope 27 January to 2 February 2025 : జనవరి 27 నుంచి ఫిబ్రవరి 02 వరకూ ఈ వారం ధనస్సు, మకరం, కుంభం, మీనం రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Weekly Horoscope  27 january to 2 february 2025 

ధనుస్సు రాశి వారఫలం (Sagittarius Weekly Horoscope)

ఈ వారం మీరున్న రంగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆలోచనలలో స్పష్టత ఉన్నప్పుడే మీ వ్యూహం విజయవంతం అవుతుంది. నూతన ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తారు. చేసే పనిపట్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి కలిసొస్తుంది... అయితే నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. ఫైనాన్స్ సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పగలరు. మీ భావాలను నియంత్రించండి. జీవిత భాగస్వామి మాటల పరిగణలోకి తీసుకోవడం మంచిది. అవివాహితులు వివాహం కోసం తొందరపడొద్దు. మీ ఆలోచనలు ఇతరులపై రుద్దొద్దు. మీ సమస్యలకు ఇతరుల్ని బాధ్యులను చేయొద్దు.  

Also Read: ఈ వారం ఈ రాశులవారు బాగా సంపాదిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు!

మకర రాశి వారఫలం  (Capricorn Weekly Horoscope)

ఈ వారం మకర రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితం చాలా బావుంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సానుకూల ఆలోచన ప్రభావంతో వ్యాపారంలో ఒకేసారి చాలా ఆర్డర్లు పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.  కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించడం పట్ల మీ ఉత్సాహం పెరుగుతుంది. బోధనతో సంబంధం ఉన్న వ్యక్తులు పెండింగ్‌లో ఉన్న పనిని సులభంగా పూర్తి చేస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు అద్భుతమైన ఒప్పందాలను పొందుతారు. మీరు మీ గృహ జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ వారం చేసే ప్రయాణాల్లో కొంత అసౌకర్యం ఉండొచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. స్నేహితుల ప్రవర్తన మిమ్మల్ని నొప్పించేలా ఉంటుంది. వారాంతంలో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. 

Also Read: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 02 వరకూ ఈ వారం ఈ 4 రాశులవారికి ఆర్థికంగా కలిసొస్తుంది!

కుంభ రాశి వారఫలం (Aquarius Weekly Horoscope)

ఈ వారం కుంభ రాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి , ఉద్యోగాలలో మంచి ఫలితాలు పొందుతారు. వైద్య రంగంలో ఉండేవారి ఆదాయం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయపడగలరు. ప్రభుత్వోద్యోగాలు చేసేవారికి గౌరవం పెరుగుతుంది. అవార్డులు అందుకుంటారు.  మీరు రుణ లావాదేవీల నుంచి దూరం పాటించాలి. లేదంటే మీ డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఇంట్లో అసంతృప్తి వాతావరణం ఉంటుంది. మీరు మీ పురోగతి విషయంలో సంతోషంగా ఉండరు..  అకస్మాత్తుగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.  మహిళలు చాలా భావోద్వేగాలకు దూరంగా ఉండాలి.

మీన రాశి వారఫలం (Pisces Weekly Horoscope)

ఈ వారం మీకు శుభవార్తతో ప్రారంభమవుతుంది. ఆర్థికంగా మరో మెట్టు ఎదుగుతారు. గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మార్గదర్శకత్వం మీ సన్నిహితులకు మేలు చేస్తుంది. వ్యవసాయ సంబంధిత పనుల నుంచి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యవసాయ సంబంధిత పనుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. పిల్లలపై ఎక్కువగా కోపం తెచ్చుకోకండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఇంటి వాతావరణంలో ఇబ్బంది ఉంటుంది. అలసట , ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌  ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs MI Match Preview IPL 2025 | సన్ రైజర్స్  హైదరాబాద్ కోమాలో నుంచి మేల్కొంటుందా.?Axar Patel Batting IPL 2025 | కీలక సమయాల్లో ఆదుకుంటున్న కెప్టెన్ ఆల్ రౌండర్KL Rahul vs Rishabh Pant | సంజీవ్ Goenka అనుకున్నది ఒకటి..అయినది ఒకటిKL Rahul Ignored LSG Owner Goenka | రాహుల్ కి ఇంకా కోపం లేదు..తిట్టారనే కసి మీదే ఉన్నట్లున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram: పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
పిఠాపురం మల్లంలో దళితుల సాంఘిక బహిష్కరణ దేని కోసం? ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతోంది?
AP SSC Results 2025: జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
జిల్లాలవారీగా ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్, అమ్మాయిలే టాప్.. 1680 స్కూళ్లలో వంద శాతం పాస్.. పూర్తి వివరాలు
SRH vs MI: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
నేడు సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై మ్యాచ్.. ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం
Pahalgam Attack Terrorists Sketch: పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
పహల్గాంలో కాల్పులు జరిపిన ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలు విడుదల
Pahalgam Baisaran Valley: బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ -  వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
బైసరన్ లోయ మినీ స్విట్జర్లాండ్ - వాహనాలు కూడా వెళ్లవు - అందుకే టెర్రరిస్టుల ప్లాన్ ?
Saeed Hussain Shah killed: హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం -  పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
హిందువుల కోసం ప్రాణం ఇచ్చిన ముస్లిం - పెహల్గాం దాడి ఘటనలో మరో కోణం
Karshmir Terror Attack: ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
ఉగ్రవాదుల దాడిలో పెద్దల్ని కోల్పోయిన రెండు తెలుగు కుటుంబాలు - వీరి కన్నీళ్లకు సమాధానం ఎలా?
Pahalgam Terror Attack Viral Photo: ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
ఆ ఫోటో మనల్ని ఎప్పటికీ వెన్నాడుతూనే ఉంటుంది… పహల్‌గామ్ దాడిలో చనిపోయిన  వ్యక్తి ఫోటో వైరల్
Embed widget