Weekly Horoscope 27 January to 2 February 2025 : ఈ వారం ఈ రాశులవారు బాగా సంపాదిస్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు!
Weekly Horoscope 27 January to 2 February 2025 : జనవరి 27 నుంచి ఫిబ్రవరి 02 వరకూ ఈ వారం సింహం, కన్యా, తులా, వృశ్చికం రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Weekly Horoscope 27 january to 2 february 2025
సింహ రాశి వారఫలం ((Leo Weekly Horoscope)
ఈ వారం సింహ రాశివారికి ఆర్థికంగా కలిసొస్తుంది. కుటుంబంలో వివాదాలు సర్దుమణుగుతాయి. మీ శక్తి , సామర్థ్యాన్ని గుర్తించే అవకాశం మీకు లభిస్తుంది. సవాలు చేసే పనిని పూర్తిచేస్తారు. చాలా దూరంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. స్నేహితులతో వ్యాపారాన్ని ప్లాన్ చేయవచ్చు. జీవిత భాగస్వామితో కూర్చుని మాట్లాడడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో వేరేవారి జోక్యాన్ని సహించవద్దు...అదే సమయంలో ఇతరుల విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉండాలి. పిల్లల చదువుపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
కన్యా రాశి వారఫలం (Virgo Weekly Horoscope)
ఈ వారం కన్యారాశి వారికి శుభ ఫలితాలను తెస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెట్టుకోవద్దు. స్నేహితులతో వ్యాపార ఒప్పందాలు చేయవచ్చు. చేసే పనిపై శ్రద్ధ వహించండి. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. భూములు లేదా నూతన గృహ నిర్మాణంపై ఆసక్తి చూపిస్తారు. పెద్దల ఆశీర్వాదం మీపై ఉంటుంది.పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ సామర్థ్యాన్ని అనుమానించవద్దు. మీ ప్రాధాన్యతలను గుర్తించండి. అధ్యయనాలపై మీ ఆసక్తి తగ్గుతుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉద్భవిస్తుంది. చెవి లేదా గొంతు సమస్యలు సంభవించవచ్చు.
Also Read: జనవరి 27 నుంచి ఫిబ్రవరి 02 వరకూ ఈ వారం ఈ 4 రాశులవారికి ఆర్థికంగా కలిసొస్తుంది!
తులా రాశి వారఫలం (Libra Weekly Horoscope)
తులారాశివారికి ఈ వారం ప్రారంభం బావుంటుంది. ఉద్యోగులకు ఉండే ఆందోళనలు తొలగిపోతాయి. పాత అప్పులు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తారు. మార్కెటింగ్ సంబంధిత ఉద్యోగంలో ఆర్థిక లాభం ఉంటుంది. రాజకీయ వ్యక్తులకు ఉన్నత పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించవచ్చు. వ్యాపార పర్యటనల వల్ల పాత మిత్రులను కలుసుకుంటారు. అదృష్టం కలిసొస్తుంది. వృత్తిలో పురోగతికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. మిమ్మల్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. వైవాహిక జీవితంలో అపార్థాలు ఏర్పడతాయి. వారం మధ్యలో అనవసరమైన సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండటం అవసరం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Also Read: జనవరి 23 నుంచి ఫిబ్రవరి 09 వరకూ మీ రాశిపై బుధుడి ప్రభావం.. ఎవరికి లాభం, ఎవరికి నష్టం!
వృశ్చిక రాశి వారఫలం (Scorpio Saptahik Rashifal)
ఈ వారం వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్‌లు పొందుతారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. తక్కువ ప్రయత్నం తోనే ఎక్కువ ఫలితం పొందుతారు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. అదృష్టం కలిసొస్తుంది. పాత సమస్యలకు మంచి పరిష్కారం పొందడం మీకు సంతోషంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వాహనం కారణంగా ఇబ్బంది పడతారు. మీరు ఎవరితోనూ అమర్యాదగా ప్రవర్తించవద్దు. అధికారులతో సున్నితంగా మాట్లాడండి. తప్పుడు వ్యక్తులకు మద్దతు ఇవ్వొద్దు. మీరు మంచి పనులు చేసినా ఉద్దేశపూర్వకంగా విమర్శించేవారున్నారు జాగ్రత్త.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!





















