Anaganaga Oka Raju OTT platform: 'అనగనగా ఒక రాజు' ఓటీటీ పార్ట్నర్ లాక్... నవీన్ పొలిశెట్టి కామెడీ మూవీని ఏ ఓటీటీ తీసుకుందంటే?
Anaganaga Oka Raju OTT platform : నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు' ఓటీటీ ప్లాట్ ఫామ్ లాక్ అయ్యింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోలలో నవీన్ పొలిశెట్టి ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈ హీరో కొత్త మూవీ రిలీజ్ మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. చివరిసారిగా నవీన్ పొలిశెట్టి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో అనుష్క హీరోయిన్ గా నటించగా ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నవీన్ ను తెరపై చూసి చాలా కాలం కావడంతో ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అందుకే ఆయన కొత్త సినిమా 'అనగనగా ఒక రాజు' ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలా వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. 'అనగనగా ఒక రాజు' మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లాక్ అయ్యింది.
'అనగనగా ఒక రాజు' డిజిటల్ రైట్స్ సోల్డ్
'జాతి రత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో నవీన్ పొలిశెట్టి. అప్పటిదాకా కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన నవీన్ ఈ సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' అంటూ సీనియర్ హీరోయిన్ తో నటించి అలరించాడు. ఇక ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. మూవీ రిలీజ్ కి ముందే నాగ వంశీ ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసి సినిమాను ప్రాఫిట్ జోన్లో పడేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ మూవీ రైట్స్ ఎంత ధర పలికాయి అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Grab your gold, the King is getting married! 🤭
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025
Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8
Also Read: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Also Read: బాలీవుడ్‌లో శ్రీలీల ఫస్ట్ మూవీ - రొమాన్స్ డోస్ పెంచేసిందిగా.. ఫస్ట్ లుక్ చూశారా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

