Telangana Ration Card Latest News: రేషన్ కార్డు యజమాని మహిళే- కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
Telangana Ration Card Latest News: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు గృహిణిలు పేరు మీద రానున్నాయి. ఉగాది నాటికి రేషన్ తీసుకునేలా పంపిణీ చేయనున్నారు.

Telangana Ration Card Latest News: కొత్త రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జారీ చేసే కొత్త రేషన్ కార్డులకు యజమానులగా గృహుణులను చేయనుంది. ఇప్పటికే రేషన్ కార్డు డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూశారని ఫైనలైజ్ కూడా చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో రేషన్ కార్డులు మహిళ పేరుతో ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు రేషన్ కార్డులో కుటుంబ యజమానిగా పురుషుల పేర్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. కుటుంబంలో ఉన్న ఇళ్లాలనే కుటుంబ యజమానిగా పేర్కోనుంది.
కొత్త రేషన్ కార్డులు ఈసారి ఏటీఎం కార్డు మోడల్‌లో తీసుకు వస్తున్నారు. ఇందులో ఓవైపు ముఖ్యమంత్రి ఫోటో మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ఉంటుంది. మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో ఉంటుంది. వీటితోపాటు కుటుంబ యమజమాని ఫొటో కూడా ఉంటుంది. అయితే కుటుంబ యజమాని ఫొటో ఒకటి సరిపోతుందా లేకుంటే యావత్ కుటుంబం ఫొటో ఉంచాలా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
Also Read: ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
ప్రభుత్వం ఇచ్చే కొత్త రేషన్ స్మార్ట్ కార్డులో కార్డుదారుల వివరాలతోపాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేస్తే వారి పూర్తి వివరాలు వస్తాయి. అంతే కాకుండా ఆ కార్డు ఏ రేషన్ దుకాణానికి సంబంధించిందో కూడా తెలిసిపోతుంది. కార్డులు డూప్లికేషన్ లేకుండా, రేషన్ పక్కదారి పట్టకుండా ఉంటేందుకు ఇలా సమగ్ర సమాచారంతో స్మార్ కార్డులు తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం .
వచ్చే ఉగాది నాటికి కొత్త రేషన్ కార్డుదారులు రేషన్ తీసుకునేలా పంపిణీ వేగవంతం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇంకా రేషన్ కార్డు దరఖాస్తు చేయని వాళ్లు ఉంటే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ అని ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ కోడ్ ఉన్న జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో అంటే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. ఒక్కో జిల్లాకు మొదటి విడతలో లక్ష కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ ఏ జిల్లాలో ప్రారంభిస్తారు? రాష్ట్రమంతటా ఎప్పుడు ఇస్తారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

