Telangana Ration Card Latest News:ఏటీఎం కార్డులా తెలంగాణలో రేషన్ కార్డు- జిల్లాకు లక్ష చొప్పున పంపిణీకి సిద్ధం
Telangana New Smart Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డులను త్వరలో పంపీణి ప్రారంభించనుంది. కొత్త కార్డులను స్మార్ట్‌గా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

Telangana New Smart Ration Cards :తెలంగాణలో త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలు కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త కార్డులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముందుగా జిల్లాకు లక్ష కార్డులు చొప్పున పంపిణీ చేయనున్నారు.
కొత్తగా రూపొందించి రేషన్ కార్డులు ఏటీఎం కార్డు మాదిరిగా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఫొటోతో ఈ కార్డులు వస్తాయని అంటున్నారు. ఈ కార్డులు చాలా స్మార్ట్‌గా ఉంటుందని దానిపై ఓ క్యూఆర్ కోడ్ కూడా ముద్రిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఆ కార్డు వివరాలు వెంటనే తెలుసుకునే వీలుంటుందని అంటున్నారు.
ఏటీఎం కార్డు మాదిరి ఎందుకు?
ఏటీఎం కార్డులా ఉంటే క్యారీ చేయడం సులభం అవుతుందని చెబుతున్నారు. జేబులో పెట్టుకొని క్యారీ చేయడానికి వీలు అవుతుందని వెల్లడించారు. త్వరగా చినిగిపోదని మన్నిక ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఆ కార్డు వివరాలు త్వరగా తెలుసుకునేందుకు దానిపై క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుమంది.
Also Read: కొత్త రేషన్ కార్డు ఆశావాహులకు గుడ్ న్యూస్ - కీలక అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఈ కార్డులో ఎడమ వైపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో ఉంటుంది. కుడివైపున పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటో ఉంటుంది. మధ్యలో తెలంగాణకు చెందిన లోగో ఉంటుంది.
ఇందులో ముందు వైపు కుటుంబ సభ్యులు వివరాలు ఉంటాయి. వారి పేర్లు, వయసు, పుట్టిన తేదీలు ఉంటాయి. అంతేకాకుండా దాని వెనుకాల లబ్ధిదారుడి పేరు చిరునామా, రేషన్ దుకాణం వివరాలు కూడా ముద్రిస్తారు. డీలర్ కాంటాక్ట్ నెంబర్, రేషన్ షాపు సమయాన్ని ముద్రిస్తారు. దీన్ని బయోమెట్రిక్‌తో అనుసంధానించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పౌరసరఫరాల అధికారులతో సమావేశమయ్యారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు అంశంపై రివ్యూచేశారు. గతంలో చాలా వేదికపై దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తే ఇంకా ఎందుకు మీ సేవ కేంద్రాల వద్ద జనం ఎగబడుతున్నారని అధికారులను ప్రశ్నించారు. అప్లై చేసిన వాళ్లే పదే పదే చేస్తున్నారని అందుకే మీ సేవ కేంద్రాల వద్ద పరిస్థితి గందరగోళంగా ఉందని తెలిపారు.
మీ సేవ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించి ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాటిని తప్పించాలని సూచించారు. కోడ్ అమలులో లేని జిల్లాల్లో పంపిణీ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తైనందున ఆయా గ్రామాలకి కూడా లిస్ట్‌లు వెళ్లిపోయాయి. ఆన్‌లైన్‌లో కూడా లిస్ట్‌లో పేర్లు చూసుకునే వెసులుబాటు కల్పించారు. ఒకసారి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైతే... ఇంకా అర్హులు ఉంటే అప్లై చేసుకుంటారు. అప్పుడు ఇంత రద్దీ ఉండబోదని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎగిరి గంతేసే వార్త- బిగ్ అప్‌డేట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం





















