Anil Ravipudi: మెగాస్టార్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిల్ రావిపూడి... బిగ్ లీగ్‌లో చేరినట్టేనా?
Anil Ravipudi Remuneration: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు డైరెక్టర్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తర్వాత ఒక ఫెయిల్యూర్ కూడా లేకుండా ముందుకు వెళుతున్న దర్శకుడు ఎవరు అంటే వినిపించే పేరు అనిల్ రావిపూడి. ఒక సినిమా వెనుక మరొకటి... దర్శకుడిగా ఆయన తీసిన ఎనిమిది సినిమాలు సూపర్ హిట్లే. దాంతో ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు టాక్.
చిరంజీవి సినిమాకు పాతిక కోట్లు!?
Anil Ravipudi Remuneration for Chiranjeevi Movie: విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా సంక్రాంతి బరిలో భారీ విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి... ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు ఉన్న సత్తా ఏమిటో మరోసారి చూపించింది. దాంతో అనిల్ రావిపూడి రేంజ్ భారీగా పెరిగింది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ అధినేత సాహు గారపాటి ఒక సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాకు అనిల్ రావిపూడి పాతిక కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి'ని కూడా సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమాకూ అనిల్ రావిపూడి భారీ రెమ్యూనరేషన్ అందుకున్నారు.
చిరు సినిమాతో బిగ్ లీగ్‌లో అనిల్?
తెలుగులో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడు ఎవరు అంటే మరొక సందేహం లేకుండా వినిపించే పేరు రాజమౌళి. ఒక్క తెలుగులో మాత్రమే కాదు... హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఆ మాటకు వస్తే ఇప్పుడు ఫారిన్ కంట్రీలలో కూడా రాజమౌళి పేరు మీద బిజినెస్ జరుగుతుంది. హీరోలతో సమానంగా ఆయన డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు.
Also Read: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
రాజమౌళి తర్వాత ఎవరు? అని ప్రశ్నిస్తే... సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను వంటి దర్శకులు ఉంటారు. పాన్ ఇండియా హిట్ పుష్ప తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ పెరిగింది కానీ మిగతా దర్శకులు రీజనల్ సినిమాలు - భారీ యాక్షన్ ఎంటర్టైనర్లు తీసి రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఆ దర్శకులు జాబితాలో ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా చేరినట్టే.
హిందీలో భారీ విజయం సాధించిన 'యానిమల్', అంతకు ముందు 'కబీర్ సింగ్' సినిమాలతో సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ అయ్యారు. ప్రభాస్ 'కల్కి 2989 ఏడి'తో నాగ్ అశ్విన్ కూడా స్టార్ అయ్యారు. త్వరలో వాళ్ళు చేయబోయే తర్వాత వాళ్ల రెమ్యూనరేషన్ పెరుగుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

