NTR Neel Movie: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
Jr NTR Upcoming Movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని టాక్.

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఓ పాన్ ఇండియా సినిమాకు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించి చాలా రోజులు అయింది. మరి సినిమా సెట్స్ మీదకు వెళ్లేది ఎప్పుడు? అంటే ఈ వారంలోనే అని చెప్పాలి.
గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ!
NTR Neel Movie Regular Shooting Update: ఎన్టీఆర్ - నీల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ సిటీలో ఈ గురువారం (అంటే ఫిబ్రవరి 20వ తేదీ) నుంచి ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'సలార్' విడుదల తర్వాత నుంచి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. కథ ఎప్పుడో లాక్ చేశారు. ఆ కథకు ఇప్పుడు తుది మెరుగులు దిద్దారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కావడంతో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అయ్యారు.
ఎన్టీఆర్ ఎప్పటి నుంచి జాయిన్ అవుతారు?
ఈ నెల 20వ తేదీన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికీ... ఈ సినిమా సెట్స్ మీదకు హీరో ఎన్టీఆర్ రావడానికి కొంత సమయం పడుతుందని తెలిసింది. కొన్ని రోజుల తర్వాత ఆయన జాయిన్ అవుతారట. అప్పటి వరకు హీరో అవసరం లేని సన్నివేశాలను షూట్ చేయడానికి ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు.
ఎన్టీఆర్ - నీల్ సినిమాకు నిర్మాతలు ఎవరంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2 ది రూల్' సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ హిస్టరీలో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ - నీల్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ఖర్చు విషయంలో అసలు వెనుకంజ వేయకుండా భారీ ఎత్తున సినిమా ప్రొడ్యూస్ చేయాలని నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ దృఢ సంకల్పంతో ఉన్నారు.
హీరోయిన్ ఎవరు? ఈ సినిమా టైటిల్ ఏమిటి?
ఎన్టీఆర్ నీల్ సినిమాలో కథానాయికగా 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఎంపిక అయినట్లు చాలా రోజుల క్రితమే ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఆ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.
Also Read: తమిళ్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్... సూపర్ స్టార్‌తో స్టెప్పులు!?
'లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'ఓరి దేవుడా' (తమిళ హిట్ 'ఓ మై కడవులే'కు తెలుగు రీమేక్) దర్శకుడు అశ్వత్ మారిముత్తు తీసిన చిత్రానికి తమిళంలో 'డ్రాగన్' టైటిల్ పెట్టారు. తెలుగులో ఆ సినిమా టైటిల్ 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్' కింద మార్చారు. ఈ సినిమాను తెలుగులో, ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఎన్టీఆర్ - నీల్ సినిమా కోసం 'డ్రాగన్' టైటిల్ రిజిస్టర్ చేయడంతో తెలుగులో వాళ్లకు ఆ టైటిల్ ఇవ్వలేదని సమాచారం. సో... ఎన్టీఆర్ - నీల్ సినిమాకు తెలుగులో 'డ్రాగన్' అని పెడితే తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా అదే టైటిల్ ఉంటుందా? లేదంటే 'ఎన్టీఆర్ డ్రాగన్' అని మారుస్తారా? అనేది చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

