Pooja Hegde: తమిళ్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్... సూపర్ స్టార్‌తో స్టెప్పులు!?
Pooja Hegde Special Song: స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించే హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఆల్రెడీ రెండు మూడు సాంగ్స్ చేశారు. ఇప్పుడు మరొక సౌంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట

బుట్ట బొమ్మ పూజ హెగ్డే కు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్త కాదు. కానీ రెమ్యూనరేషన్ కోసం అన్నట్లు ఆవిడ స్పెషల్ సాంగ్స్ చేయరు. ఓ సాంగ్ చేసేముందు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచిస్తారు. బుట్ట బొమ్మ గతంలో రెండు స్పెషల్ సాంగ్స్ చేశారు. ఐటమ్ సాంగ్ అంటే గ్లామర్ షో చేయాలి అన్నట్టు కాకుండా పాటకు తగ్గట్లు డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు ఈ అందాల భామ మరొక స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్.
తమిళ సినిమాలో స్టార్ హీరోతో పూజ స్పెషల్ సాంగ్!?
Rajinikanth Coolie Movie Update: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'కూలీ'. కార్తి హీరోగా 'ఖైదీ', దళపతి విజయ్ హీరోగా 'మాస్టర్', 'లియో', ఇక కమల్ హాసన్ కమ్ బ్యాక్ బాక్సాఫీస్ హిట్ 'విక్రమ్' సినిమాలకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ తీస్తున్న లేటెస్ట్ సినిమా ఇది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
Pooja Hegde Item Song In Coolie: కూలిలో కమల్ హాసన్ కుమార్తె శృతీ హాసన్ ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు. సినిమాలో ఆవిడ మీద సాంగ్ ఎలాగో ఉంటుంది. అయితే శృతికి బదులు మరో గ్లామర్ హీరోయిన్ కావాలని లోకేష్ కనకరాజ్ ప్లాన్ చేశారు. బుట్ట బొమ్మ పూజా హెగ్డే చేత ఒక స్పెషల్ సాంగ్ చేయించాలని అనుకున్నారట. సూపర్ స్టార్ రజని సినిమా కావడంతో బుట్ట బొమ్మ కూడా సాంగ్ చేయడానికి ఓకే చెప్పారట. తెలుగులో రామ్ చరణ్ 'రంగస్థలం', వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ 'ఎఫ్ 3'లో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్స్ చేశారు.
రజనీకాంత్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ స్పెషల్ ఫోకస్ పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జైలర్ బ్లాక్ బస్టర్ కావడం వెనుక అనిరుద్ రీ రికార్డింగ్ కీలక పాత్ర పోషించిందని స్వయంగా రజనీకాంత్ చెప్పారు. అది పక్కన పెడితే... రజనీ కోసం అనిరుద్ చేసిన ప్రతి సాంగ్ బాగుంటుంది. మరి ఇప్పుడు స్పెషల్ సాంగ్ కోసం ఆయన ఎటువంటి ట్యూన్ రెడీ చేశారో చూడాలి.
వేసవి నుంచి వర్షాకాలానికి విడుదల వాయిదా!?
కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... కూలి విడుదల విషయంలో వాయిదా వేయడానికి దర్శక నిర్మాతలు మెగ్గు చూపిస్తున్నారట. తొలుత ఈ సినిమాను వేసవి కానుకగా మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే ఇప్పుడు మే నుంచి ఆగస్టు కు వెళ్లడం మంచిదని భావిస్తున్నారట. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు కట్టప్ప సత్యరాజ్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: ప్రభాస్... నాగ్ అశ్విన్... మధ్యలో ఆలియా - 'కల్కి 2898 ఏడీ' దర్శకుడి నయా ప్లాన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

