Alia Bhatt - Nag Ashwin: ప్రభాస్... నాగ్ అశ్విన్... మధ్యలో ఆలియా - 'కల్కి 2898 ఏడీ' దర్శకుడి నయా ప్లాన్
Kalki 2898 AD director Nag Ashwin movie: దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్రభాస్ బదులు ఆలియాతో ముందుకు వెళ్లడం బెటర్ అని ఆయన ఫిక్స్ అయ్యారా? అని హిందీ ఇండస్ట్రీలో డిస్కషన్ మొదలైంది.

యువ దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) సత్తా ఏమిటో 'కల్కి 2989 ఏడీ'తో ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీకి తెలిసింది. 'మహానటి' దర్శకుడిగా ఆయనకు గౌరవం తీసుకు వచ్చినా... రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆయన తీసిన సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కల్కి విడుదలకు ముందు నుంచి సీక్వెల్ ఉంటుందని చెప్పారు. ఆ సీక్వెల్ స్క్రిప్ట్ మీద నాగ్ అశ్విన్ వర్క్ చేస్తున్నారని కూడా చెప్పారు. కట్ చేస్తే... ఇప్పుడు ఆలియా భట్ పేరు తెర మీదకు వచ్చింది. నాగ్ అశ్విన్ మనసులో ఏముంది? ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారు? వంటి వివరాల్లోకి వెళితే...
ప్రభాస్ కంటే ముందు ఆలియాతో!?
'ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ భామ ఆలియా భట్. అంతకుముందు ఆవిడ నటించిన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. కానీ త్రిబుల్ ఆర్ తెలుగులో ఆవిడకు తొలి సినిమా. కల్కి విడుదల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆవిడ ఒక సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవి ఒక కొలిక్కి వచ్చాయి అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' సినిమా చేస్తున్నారు ఆలియా భట్. అందులో ఆమె భర్త రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలు. ఈ ఏడాది నవంబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంచనా. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. ప్రభాస్ కంటే ముందు ఆలియాతో సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ సెట్స్ మీదకు తీసుకు వెళ్తారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండడంతో...!
ఇప్పుడు ప్రభాస్ ఫుల్ బిజీ. ఒక వైపు మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా పూర్తి చేయడానికి ముందు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా మొదలైంది. 'ఫౌజీ' పూర్తి కావడానికి సమయం పడుతుంది. పోనీ ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక కల్కి సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభించడానికి ప్రభాస్ రెడీగా ఉంటారా? అంటే... అవును అని చెప్పడం సందేహమే. ఎందుకంటే... సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన 'స్పిరిట్' సినిమా చేయాల్సి ఉంది. మరొక వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సీక్వెల్ కూడా ఉంది. ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండడంతో మధ్యలో మరొక సినిమా చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారట. అది సంగతి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

