ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'ని ఎప్పుడు అనౌన్స్ చేశారు? షూటింగ్, టైటిల్, రిలీజ్ వరకు... ఇంపార్టెంట్ డీటెయిల్స్!    

ఫిబ్రవరి 2020... ఆల్మోస్ట్ నాలుగున్నరేళ్ల క్రితం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు.

ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాను ముందు నుంచి 'ప్రాజెక్ట్ కె' అని వ్యవహరిస్తూ వచ్చారు. 

ఫిబ్రవరి 2020లో అనౌన్స్ చేసినా... కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా జూలై 2021లో సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. 

హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఫ్యూచరిస్టిక్ సెట్‌లో 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ స్టార్ట్ చేశారు.

జూలై 21, 2023లో టైటిల్ అనౌన్స్ చేశారు. 'ప్రాజెక్ట్ కె' అంటే 'కల్కి 2898 ఏడీ' అని చెప్పారు.

'కల్కి 2898 ఏడీ' చిత్రీకరణ జూలై 2021 నుంచి మార్చి 2024 వరకు ఇండియా, ఇటలీలో జరిగింది.

వైజయంతి సంస్థకు పేరు, విజయాలు అందించిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి మే 9న విడుదల అయ్యాయి. 

'కల్కి 2898 ఏడీ'నీ మే 9న విడుదల చేయాలని ప్లాన్ చేయగా... దేశవ్యాప్తంగా ఎన్నికల కారణంగా వాయిదా పడి జూన్ 27న వస్తోంది.

రూ. 600 కోట్లతో నిర్మించిన 'కల్కి' కథ మహాభారతం నుంచి 2898AD వరకు సాగుతుంది.

ఆదిపురుష్ (జూన్ 16, 2023), సలార్ (డిసెంబర్ 22, 2023), కల్కి (జూన్ 27, 2023)... ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశారు ప్రభాస్.

'కల్కి 2898 ఏడీ' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 385 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 180 కోట్లు

'కల్కి 2898 ఏడీ' సినిమా ఫస్ట్ డే ఆల్మోస్ట్ 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ఓ అంచనా. 

అమెరికాలో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్రెడీ 3 మిలియన్ డాలర్స్ క్రాస్ చేశాయి.

Thanks for Reading. UP NEXT

సోనాక్షికి భర్త జహీర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ - దాని ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

View next story