బాలీవుడ్‌ బ్యూటీ సోనాక్షి సిన్హా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే

తన ప్రియుడు, నటుడు జహీరో ఇక్బాల్‌తో ఆదివారం(జూన్‌ 23) ఏడడుగులు వేసింది

ఏడేళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు

ప్రస్తుతం సోనాక్షి-జహీర్‌ ఇక్బాల్‌లు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు

అయితే పెళ్లికి ముందే తన కాబోయే భార్య సోనాక్షికి జహీర్‌ ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడట

పెళ్లి అనంతరం సోనాక్షి-జహీర్ ముంబైలోని ఓ రెస్టారెంట్‌కి బీఎండబ్ల్యూ ఐ7 కారులో వచ్చారు

ఈ ఎలక్ట్రిక్‌ లగ్జరీ కారును సోనాక్షికి జహీరో కానుకగా ఇచ్చాడట

దీని మార్కెట్‌ ఖరీదు రూ.2 నుంచి రూ.3 కోట్లు ఉంటుందట, ఇది తెలిసి అంతా అవాక్కవుతున్నారు

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది

Image Source: All Image Credit: aslisona/Instagram

ఇదిలా ఉంటే వీరిద్దరిది వేరు వేరు మతాల కారణంగా ఈ జంట నెట్టింట ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నారు