వరల్డ్‌వైడ్ 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ 385 కోట్లు. మరి, ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారో తెలుసా? చూడండి. 

తెలుగు సినిమా ఎక్కువ వసూళ్లు వచ్చేది ఆంధ్ర నుంచి! ఆంధ్ర ఏరియాలను 83 కోట్ల రేషియోలో విక్రయించారు.

ఆంధ్ర తర్వాత తెలుగు సినిమాకు కీలకమైన మార్కెట్ తెలంగాణ (నైజాం) నుంచి! రూ. 70 కోట్లకు అమ్మారు.

ఏపీలోని రాయలసీమ (సీడెడ్) ఏరియాలను రూ. 27 కోట్లకు విక్రయించారు. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 180 కోట్లు!

'కల్కి 2898 ఏడీ' తమిళనాడు రైట్స్ 16 కోట్లకు, కర్ణాటక 28, కేరళ 6 కోట్లకు విక్రయించారు.

'కల్కి 2898 ఏడీ' హిందీ వెర్షన్ రైట్స్ అమ్మకాల ద్వారా రూ. 85 కోట్లు వచ్చాయని తెలిసింది. 

ఓవర్సీస్ మార్కెట్ నుంచి 'కల్కి 2898 ఏడీ'కి మంచి రేటు వచ్చింది. రూ. 70 కోట్లు నిర్మాతకు చేరింది.

వరల్డ్ వైడ్ 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 385 కోట్లు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ ప్లేస్ దీనిదే.

ప్రీ రిలీజ్ బిజినెస్‌కు తగ్గట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు లాభాలు రావాలంటే మినిమమ్ 400 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి.