Mazaka movie OTT: 'మజాకా' ఓటీటీ డీల్ క్లోజ్... థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్?
Mazaka OTT Platform: సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా... రావు రమేష్, అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మజాకా'. ఈనెల 26న థియేటర్లోకి వస్తుంది. ఓటీటీ ఆల్రెడీ క్లోజ్ అయిందని తెలిసింది.

యువ కథానాయకుడు, పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ (Sundeep Kishan) నటిస్తున్న తాజా సినిమా 'మజాకా' (Mazaka Movie). ఆయన సరసన రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్ రోల్ చేశారు. విలక్షణ నటుడు రావు రమేష్, 'మన్మథుడు' హీరోయిన్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల (ఫిబ్రవరి 26)న థియేటర్లోకి వస్తోందీ సినిమా. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యిందని ఫిల్మ్ నగర్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
'మజాకా' ఓటీటీ రైట్స్ తీసుకున్నది ఎవరంటే?
Mazaka Movie OTT Platform: 'మజాకా' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్, అలాగే శాటిలైట్ టెలికాస్ట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్వర్క్ 'జీ' గ్రూప్ సొంతం చేసుకుందని తెలిసింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 'జీ 5' ఓటీటీ, 'జీ తెలుగు' ఛానల్‌లో రిలీజ్ కానుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... థియేటర్లలో విడుదల అయిన నాలుగు వారాలకు 'జీ 5' ఓటీటీలో 'మజాకా' స్ట్రీమింగ్ కానుందట. ఈ నెల అంటే ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాను మార్చి 26 లేదా 28వ తేదీల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉందట. 'సంక్రాంతికి వస్తున్నాం' తరహాలో భారీ విజయం సాధిస్తే మరొక మూడు నాలుగు వారాలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది.
'మజాకా' సినిమా నిర్మాణ సంస్థల్లో 'జీ స్టూడియోస్' కూడా ఉంది. తమ నెట్వర్క్ ఓటీటీ, టీవీ కోసం డిజిటల్ స్ట్రీమింగ్, శాటిలైట్ రైట్స్ ఉంచుకుంది. ఇటీవల 'జీ స్టూడియోస్' సంస్థ నిర్మించే చిన్న హీరోల సినిమాలను వేరే ఓటీటీలకు ఇవ్వడం లేదు. స్టార్ హీరోల సినిమాలకు మంచి రేటు వస్తే మాత్రమే ఇచ్చేస్తున్నారు.
సూపర్ హిట్ కాంబో త్రినాథ, ప్రసన్నకలయికలో!
దర్శకుడు త్రినాథ రావు నక్కిన, రచయిత ప్రసన్న కుమార్ బెజవాడది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ అయ్యాయి. సో, ఈ 'మజాకా' సినిమా కూడా సోలో హీరోగా సందీప్ కిషన్‌కు హిట్ అందిస్తుందని యూనిట్ అంతా నమ్మకంగా ఉంది.
Also Read: 'ఆహా'తో పాటు మరో ఓటీటీలోకి వరుణ్ సందేశ్ సైకలాజికల్ థ్రిల్లర్ 'విరాజి' - డబ్బులు కట్టి చూస్తారా మరి?
హీరోగా సందీప్ కిషన్ 30వ సినిమా 'మజాకా'. సోలో హీరోగా ఇటీవల ఆయనకు భారీ బ్లాక్ బస్టర్స్ లేనప్పటికీ... ధనుష్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాయన్'లో మంచి విజయం అందుకున్నారు. అందులో సందీప్ కిషన్ పాత్రకు కూడా పేరు వచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత 'మజాకా' వస్తుండటం కొంచెం ప్లస్ అయ్యే అంశం.
'మజాకా' చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. నిజార్ షఫీ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించగా... బ్రహ్మ కడలి కళా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంస్థలపై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ పోపూరి, స్టంట్స్: పృథ్వీ.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

