Maha Shivratri 2025 : శివయ్యకు ప్రియమైన రాశులివే..మహా శివరాత్రి రోజు ఏం చేయాలంటే!
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాలుగు రాశులవారిపై శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందన చెబుతారు. పరమేశ్వరుడికి ఇష్టమైన ఆ నాలుగు ప్రియమైన రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి

Maha Shivratri 2025: మార్చి 26 మహా శివరాత్రి. ఈ రోజు పరమేశ్వరుడిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ 4 రాశులవారు శివుడికి భక్తి శ్రద్ధలతో పూజించి, నమస్కరిస్తే ఏం కోరుకున్నా నెరవేరుతుందని చెబుతారు పండితులు.
మేష రాశి (Aries)
మేష రాశికి అంగారకుడు అధిపతి. శివుడు ఓసారి రాక్షసులతో యుద్ధం చేస్తుండగా ఆయన శరీరం నుంచి చమట చుక్క భూమిపై పడింది. అదే అంగారక గ్రహం అని చెబుతారు. అందుకే మహాశివరాత్రి రోజు ఈ రాశివారు పరమేశ్వరుడిని ఆరాధిస్తే అంతా శుభమే జరుగుతుందని విశ్వాసం. ఈ రోజు శివయ్యను గంగాజంలో, పాలతో అభిషేకించాలి.
Also Read: ఫిబ్రవరి ఆరంభం నుంచి ఏప్రిల్ 18 వరకూ ఈ 4 రాశులవారిపై శని తీవ్ర ప్రభావం!
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. జాతకంలో ఉండే అతి పెద్ద దోషాల్లో కుజదోషం ఒకటి.అందుకే ఈ రాశివారు మంగళ వారం కానీ కృత్తికా నక్షత్రం రోజున కానీ శివాలయంలో కుజుడికి లేదా సుబ్రహ్మణ్యస్వామికి ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూటగా కట్టి తాంబూలం ఇవ్వాలని చెబుతారు. మహా శివరాత్రి రోజు వృశ్చిక రాశివారు శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పటివరకూ మీ జీవితంలో ఉండే సంక్షోభం తీరిపోతుంది. మీలో మీకు తెలియకుండా ఏర్పడిన ఓ భయం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
Also Read: ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఈ 3 రాశులవారికి శని యోగాన్నిస్తాడు..ఈ 3 నెలలు వెయిట్ చేయాల్సిందే!
మకర రాశి (Capricorn)
మకర రాశికి అధిపతి శని. శని ఎవరో మీకు తెలుసుకదా..స్వయంగా సూర్యుడి పుత్రుడు, శివుడికి భక్తుడు. అందుకే మకర రాశివారిపై శివుడి అనుగ్రహం ఉంటుంది. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసి..శివుడికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు చేపట్టే పనుల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి విజయం సాధిస్తారు.
కుంభ రాశి (Aquarius )
కుంభ రాశికి కూడా శని దేవుడే అధిపతి. అందుకే ఈ రాశివారిపైనా శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడి ఆరాధాన కుంభ రాశివారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్నిస్తుంది. ఈ రోజు కుంభ రాశివారు నీటితో శివుడిని అభిషేకించాలి. ఈరోజు మీరు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాలను అందిస్తుంది.
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

