masturbation ban: హస్తప్రయోగాన్ని నిషేధించాలట-పార్లమెంట్‌లో బిల్లు కూడా పెట్టేశాడు- ఈ ఎంపీ మరీ అతిగాడిలా ఉన్నాడే !
US lawmaker: అమెరికాకు చెందిన ఓ డెమెక్రాట్ ఎంపీకి విచిత్రమైన ఆలోచన వచ్చింది. మగవాళ్లు హస్తప్రయోగం చేసుకుని ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారట. దాన్ని బ్యాన్ చేయాలని ప్రైవేటు బిల్లు తెచ్చాడు

US lawmaker issues bill to ban men for masturbating without intent to make a baby: హస్తప్రయోగం అందరూ చేసే పని కానీ ఎవరూ బహిరంగంగా చేయరు.. అంతకు మించి ఒప్పుకోరు కూడా. ఛీ..ఛీ మాకు అలాంటి అలవాట్లు లేవని చెబుతారు. అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిషేధించాలని అంటే.. హస్త ప్రయోగం చేసుకోవడాన్ని నిషేధించాలని ఓ అమెరికన్ ఎంపీకి ఆలోచన వచ్చింది. అలా వచ్చిందే తడవుగా.. ఓ ప్రైవేటు బిల్లు చట్టసభలో ప్రవేశ పెట్టేశాడు.
పురుషులు హస్త ప్రయోగం చేసుకోకుండా నిషేధించాలని, అతిక్రమిస్తే నేరంగా పరిగణించాలని అమెరికా సెనేట్ ముందుకు డెమోక్రటిక్ పార్టీకి చెందిన మిసిసిప్పి సెనేటర్ బ్రాడ్‌ఫర్డ్ బ్లాక్‌మన్ ప్రవేశ పెట్టారు. పిల్లల్ని కనే ఉద్దేశం లేకుండా ఎవరైనా సరే ఉత్తినే సంతృప్తి కోసం హస్త ప్రయోగం చేసుకోకూడదని ఆయన చెబుతున్నారు. పిల్లల్ని పుట్టించే ట్రీట్ మెంట్ల కోసం అయితే చేసుకోవచ్చట. ఈ బిల్లులో ఆయన జరిమానాలు కూడా ప్రతిపాదించారు. చట్టాన్ని అతిక్రమించిన వారికి మొదటిసారి రూ.86 వేలు, రెండోసారి రూ.4.33 లక్షలు, తరచూ ఉల్లంఘించే వారికి రూ.8.65 లక్షల జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. వీర్యదానం కోసం హస్త ప్రయోగం చేసుకోవడం, కండోమ్ వాడి శృంగారంలో పాల్గొనడం మాత్రం ఈ బిల్లు ప్రకారం నేరం కాదని అయనంటున్నారు.
ఈ బిల్లు చాలా కామెడీగా ఉందని తెలుసని ఆయినా తాను కావాలనే పెట్టానని ఈ ఎంపీ అంటున్నారు.ఎందుకంటే అమెరికాలో చట్టాలు చేసే వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయట. వాటిని బయట పెట్టడానికే ఈ ప్రైవేటు బిల్లు పెట్టానని అంటున్నారు. మహిళల అబార్షన్ విషయంలో వారికి ఉన్న హక్కులపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అందుకే మహిళల పునరుత్పత్తి హక్కులపై ఆంక్షలకు ఇది తన ప్రతిస్పందన అని ఎంపీ చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మిసిసిప్పిలో గర్భనిరోధకం, అబార్షన్‌కు సంబంధించి ప్రవేశపెడుతున్న మెజార్టీ బిల్లులు మహిళల పాత్రపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని ఆయనంటున్నారు. పురుషుల పాత్రను పట్టించుకోవడం లేదని గర్భనిరోధకంలో పురుషుల పాత్ర ఉంటుందనే నిజాన్ని చర్చకు తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశమని చెబుతున్నారు.
ఆయన ప్రయత్నం సక్సెస్ అయింది. ఇప్పుడు మిస్సిసిపితో పాటు అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ బిల్లు హాట్ టాపిక్ అవుతోంది. అదంతా సరే కానీ ఒక వేళ బిల్లు ఆమోదం పొందితే.. హస్త ప్రయోగం చేసే వారిని ఎలా పట్టుకుంటారన్న ప్రశ్న కొంత మందిలో వస్తోంది. హస్త ప్రయోగం చేసుకోకపోతే.. చాలా మందికి నిద్రలోనే ఫాంటసీలో ప్యాంట్ తడిచిపోతుంది. మరి అలాంటి వారికీ శిక్ష విధిస్తారా అని కొంత మంది ముందు చూపు ఉన్న వ్యక్తులు డౌటానుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బిల్లు ఆమోదం పొందే అవకాశం వందకు వంద శాతం లేదని.. కంగారు పడాల్సిన పని లేదని.. అక్కడి నిపుణులు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

