అన్వేషించండి

Donald Trump : ట్రంప్ టారిఫ్‌ల మోత,- ఆ 3 దేశాలకు షాకిచ్చిన అమెరికా - సుంకాలపై కీలక నిర్ణయం

Donald Trump : అక్రమ వలసదారులు, డ్రగ్స్ ప్రవాహాన్ని అమెరికా సరిహద్దుల్లోకి రాకుండా అడ్డుకుంటామన్న తన ప్రచార హామీని అమలు చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక డోనాల్డ్ ట్రంప్ భారీ మార్పులు, చర్యలకు ఉపక్రమిస్తున్నారు. వలసదారుల నిషేధంపై ఫోకస్ చేసిన ప్రభుత్వం.. ఇప్పడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ అన్నంత పనీ చేశారు. తాజాగా ఆయన టారిఫ్ (Tariff) లకు సంబంధించి కీలక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం, మెక్సికోపై 25 శాతం, కెనడాపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాలు వర్తించనున్నాయి. గతంలోనూ ఈ దేశాలపై సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించగా.. ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.

కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం, చైనాపై 10శాతం టారిఫ్ అమలుపై తాను సంతకం చేశానని డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఫెంటానిల్ సహా తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన డ్రగ్స్ ముప్పు కారణంతోనే ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టామని ప్రకటించారు. అమెరికా పౌరులను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ట్రంప్.. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యమని చెప్పారు. మాదక ద్రవ్యాలే కాదు చట్టవిరుద్దంగా వచ్చే వలసదారులను సరిహద్దుల్లోకి కూడా రాకుండా చేస్తామని ఎన్నిక ప్రచారంలో చెప్పిన హామీకి.. తాను ఇప్పటికీ కట్టబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసిన వైట్ హౌస్ అధికారులు.. సుంకాల నుండి ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. సంక్షోభం తగ్గే వరకు ఈ సుంకాలు అమల్లో ఉంటాయని చెప్పారు.

ట్రంప్ నిర్ణయంతో మాంద్యం తప్పదంటోన్న నిపుణులు

ట్రంప్ ఆదేశాల ప్రకారం ఈ సుంకాలు మంగళవారం అర్థరాత్రి 12.01 (భారత కాలమానం ప్రకారం 5.01) గంటల నుంచి అమల్లోకి వస్తాయి. రవాణాలో ఉన్న వస్తువులు, కట్-ఆఫ్ సమయానికి ముందు అమెరికా సరిహద్దులోకి ప్రవేశించే వస్తువులకు సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ట్రంప్ టారిఫ్ ఆర్డర్‌ల నుంచి మినహాయింపు పొందేందుకు మూడు దేశాలు తీసుకోనున్న చర్యలపై అధికారులు ఎలాంటి వివరాలను అందించలేదు. తాజా సుంకాలు ఈ ఏడాది యూఎస్ ఆర్థిక వృద్ధిని 1.5% తగ్గించి కెనడా, మెక్సికోలను మాంద్యంలోకి నెట్టివేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

బ్రిక్స్ దేశాలపై ఆగ్రహం

అంతకుముందు ట్రంప్.. బ్రిక్స్ (BRICS) దేశాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో యూఎస్ డాలర్ కు ప్రత్యామ్నాయం చూసుకుంటే బ్రిక్స్ దేశాలపై 100శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. డాలర్ కు బదులుగా ఆయా దేశాలు మరో కరెన్సీని సృష్టించలేవని, ఒకవేళ డాలర్ ను వదులుకుంటే యూఎస్ ఎకానమీలో అమ్మకాలకు స్వస్తి పలికి, ప్రయోజనాల కోసం మరో దేశాన్ని ఎన్నుకోక తప్పని ట్రంప్ చెప్పారు. అలా చేస్తే 100 శాతం సుంకంతో పాటు, అమెరికాతో వాణిజ్యం వదుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Also Read : Budget 2025 : బడ్జెట్‌లో కొత్త పన్ను రేట్లతో నిజంగానే లాభముందా - ప్రభుత్వానికి వచ్చే నష్టమెంతంటే..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Embed widget