అన్వేషించండి

Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం

Indians Died | ఉక్రెయిన్ తీరంలో గినియా-బిస్సావు నౌకపై రష్యా చేసిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించగా, నౌకల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉక్రెయిన్ తీరం వదిలిన వాణిజ్య నౌకపై రష్యా క్షిపణి దాడి.
  • ఈ దాడిలో నలుగురు భారతీయులు సహా పదిమంది మృతి.
  • భారత్ తీవ్రంగా ఖండించి, రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ.

Russia Attacks Ukraine | ఉక్రెయిన్ తీరం నుండి బయలుదేరుతున్న గినియా- బిస్సావు జెండాతో వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై రష్యా దాడి చేసింది. నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయ పౌరులతో సహా మొత్తం 10 మంది మృతిచెందారు. భారతీయులు మృతిచెందిన ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఘర్షణ, ఉద్రిక్తతల సమయంలో మరోసారి వాణిజ్య నౌకల భద్రతపై భయాందోళన నెలకొంది. 

ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా రష్యా చేసిన దాడిపై స్పందించారు. రష్యా ఆదివారం నాడు ఉక్రెయిన్ సముద్ర కారిడార్ నుంచి వెళ్తున్న ఒక నౌకపై దాడి చేసింది. ఆ నౌక సిబ్బందిలో సిరియా, భారత పౌరులు ఉన్నారని తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌కు చెందిన నావికులు, సిబ్బంది చనిపోయిన తొలి ఘటన ఇది. 

 నౌకపై రష్యా మిస్సైల్స్ దాడి చేసింది: ఉక్రెయిన్

గినియా- బిస్సావు జెండాతో వెళ్తున్న నౌకపై రష్యా క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిందని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఎం.వి. గోల్డెన్ లియో అనే ఈ వాణిజ్య నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది, సభ్యులు ఉన్నారు. వారిలో ఐదుగురు భారత పౌరులు ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య నౌకల్ని లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడవేయడాన్ని భారత విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు నివారించాలి అని పేర్కొంది.

Also Read: Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే

రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన భారత విదేశాంగశాఖ

ఉక్రెయిన్‌లోని ఒడెసా రేవులో ఓ నౌకపై జరిగిన దాడిలో భారతీయులు మృతిచెందడంపై రష్యా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. నౌకపై దాడికి సంబంధించి రష్యా దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్‌కు భారత్ తమ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 

ఈ దాడిపై స్పందించిన MEA ఏం చెప్పింది?

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిపై స్పందించింది. ' ఆదివారం (జూలై 19) సాయంత్రం, ఎంవి గోల్డెన్ లియో ఒడెస్సా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతుండగా రష్యా దాడి చేసింది. దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దురదృష్టవశాత్తు నలుగురు భారత పౌరులు మరణించారు. ఒక భారత పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని' తెలిపింది.

ఉక్రెయిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రభావిత వారికి  సాధ్యమైన అన్ని రకాల సహాయం చేయడానికి  ప్రయత్నిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.  మృతిచెందిన భారతీయ పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన భారత పౌరుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

 రష్యా పేరును ప్రస్తావించని భారత్
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రష్యా పేరును నేరుగా ప్రస్తావించలేదు.  'భారత్ ఇటువంటి దాడులను ఖండిస్తుంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం లేదా షిప్పింగ్, వాణిజ్య స్వేచ్ఛకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ దేశం కూడా అలా దాడులు చేయకూడదు' అని స్పష్టం చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సాధారణ పౌరులు బలైపోవడం సరికాదని పేర్కొన్నారు.

Frequently Asked Questions

దాడికి గురైన వాణిజ్య నౌక ఏ దేశం జెండాతో ప్రయాణిస్తోంది?

నౌక గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తోంది. దీని పేరు ఎం.వి. గోల్డెన్ లియో.

ఈ దాడిలో ఎంతమంది భారతీయులు మరణించారు?

ఈ దాడిలో నలుగురు భారతీయ పౌరులు మరణించారు. ఒక భారత పౌరుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ దాడిపై భారత ప్రభుత్వం ఎలా స్పందించింది?

భారత ప్రభుత్వం దాడిని తీవ్రంగా ఖండించింది. రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

దాడి ఎక్కడ, ఎప్పుడు జరిగింది?

ఈ దాడి జూలై 19 సాయంత్రం, ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయం నుండి బయలుదేరుతుండగా జరిగింది. రష్యా క్షిపణులతో దాడి చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget