అన్వేషించండి

US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!

US Iran War Updates 2026:పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇరాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా ఏడో రోజూ బాంబుల వర్షం కురిపించింది. భారీ విధ్వంసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా ఏడో రాత్రి కూడా ఇరాన్‌పై బాంబుదాడులు చేసింది.
  • అమెరికా డ్రోన్‌ను కూల్చివేసి, ఇరాన్ ప్రతిదాడికి దిగింది.
  • ఇరుదేశాల తీవ్ర హెచ్చరికలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

US Iran War Updates 2026: మధ్యప్రాచ్యం అట్టుడికిపోతోంది. ఇరాన్, అమెరికా మధ్య సాగుతున్న పోరు ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. అమెరికా వైమానిక దళాలు వరుసగా ఏడో రాత్రి కూడా ఇరాన్‌పై విరుచుకు పడ్డాయి. బాంబుల వర్షం కురిపించాయి. దీంతో పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక సైనిక స్థావరాలను, క్షిపణీ, డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా వెల్లడించింది. 

పోటాపోటీగా దాడులు

అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకే ఇరాన్‌పై దాడులు జరుగుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమేనని ఇప్పటి వరకు వైమానిక దాడులకు పరిమితమయ్యాయమని ఇంకా దారికి రాకుంటే ఆ దేశంలోనే సైనిక చర్యలు చేపడతామని ట్రంప్ హెచ్చరించారు. నేరుగా ఇరాన్‌లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తామని వెల్లడించారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ తలొగ్గడం లేదు. అమెరికాను అదే స్థాయిలో ఎదుర్కొంటూ ఎదురు దాడి చేస్తోంది. వారి సైనిక స్థావరాలను నాశనం చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే జోర్దాన్ వంటి ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. 

ఏడో రోజు అమెరికా భీకర దాడులు

సెంట్‌కామ్‌ నేతృత్వంలో వ్యూహాత్మక దాడి జరుగుతోంది. ముందుగా ఇరాన్ సైనిక బలాన్ని తగ్గించి, వారికి ఉన్న కమాండ్ కంట్రోల్‌ సెంటర్లను ధ్వంసం చేయాలని చూస్తోంది. అందుకే వరుసగా ఏడో రోజు రాత్రి కూడా దాడులు చేసింది. అమెరికా చేసిన దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతమంతా వణికిపోయింది. ఇరాన్ నుంచి బహ్రెయిన్ వరకు చాలా ప్రాంతాల్లో పేలుళ్ల ప్రభావం కనిపించింది. ఏడు రోజులుగా గ్యాప్ లేకుండా చేస్తున్న దాడి కారణంగా హోర్మూజ్ జలసంధి పరిధిలోని ప్రాంతాలు అమెరికా ఆధీనంలోకి వచ్చాయి. 

MQ-9 రీపర్ డ్రోన్ కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటన 

అమెరికా దాడులకు ఇరాన్ దీటుగా బదులిస్తున్నట్టు పేర్కొంది. అమెరికాకు చెందిన MQ-9 రీపర్‌ డ్రోన్ కూల్చివేసినట్టు ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన బుషెహర్‌ పై నిఘా పెట్టినందుకు ఈ కూల్చివేశామని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డ్రోన్ విలువ 285 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఇది కేవలం నిఘా పెట్టడమే కాకుండా, క్షిపణి దాడులు చేయగలదు. ఇరాన్ ప్రకటనపై ఇంకా అమెరికా స్పందించలేదు. అయితే అమెరికాకు చెందిన కీలక వ్యవస్థను నాశనం చేశామని చెప్పడం ద్వారా తమ సైనిక శక్తి ఎంత బలంగా ఉందో ఇరాన్ చెప్పకనే చెప్పింది. 

వైట్‌ హౌస్ వ్యూహం ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంక్షోభంపై అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వైమానిక దాడులతో సరిపెట్టిన అమెరికా ఇకపై ఇరాన్ నియంత్రణలోని భూభాగాల్లోకి అమెరికా సైన్యాన్ని కూడా పంపిస్తామని హెచ్చరించారు. ఇరాన్ అణు పరిశోధన కేంద్రాలు, కీలక చమరు శుద్ధి పరిశ్రమలే లక్ష్యంగా దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఇరాన్‌ను ఆర్థికంగా నాశనం చేయాలని చూస్తోంది. అప్పుడే దారికి వచ్చి చర్చలకు అంగీకరిస్తుందని ట్రంప్ ప్లాన్. 

ఇరాన్ నుంచి కూడా గట్టి హెచ్చరిక

భూతల దాడులు చేస్తామని చెబుతున్న అమెరికాకు ఇరాన్ సర్వోన్నత నాయకుడి ప్రధాన సలహాదారు మోహ్సెన్‌ రెజాయి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అమెరికా మతిలేని దాడులను మరికొన్ని రోజులు కొనసాగితే ఇరాన్ సైన్యం చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకార చర్యలు ఎలా తీసుకోవాలో తమకు తెలుసని అన్నారు. దీని ప్రభావం కేవలం అమెరికాపైనే కాకుండా దానికి సహకరించిన పొరుగు దేశాలపై కూడా ఉంటుందని అన్నారు. ఇప్పటికే జోర్దాన్ లాంటి దేశాల్లో అమెరికా స్థావరాలపై దాడులు చేశామని గుర్తు చేస్తున్నారు. ఇరు వర్గాల హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరికొన్ని రోజులు ఈ బీభత్సం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. 

Frequently Asked Questions

అమెరికా ఇరాన్‌పై ఎన్ని రోజులుగా దాడులు చేస్తోంది?

అమెరికా వైమానిక దళాలు వరుసగా ఏడో రాత్రి కూడా ఇరాన్‌పై విరుచుకు పడ్డాయి. ఇది ఆరంభం మాత్రమేనని అమెరికా హెచ్చరించింది.

అమెరికా ఇరాన్‌లో ఏ లక్ష్యాలను ఛేదిస్తోంది?

అమెరికా ఇరాన్‌కు చెందిన వ్యూహాత్మక సైనిక స్థావరాలను, క్షిపణీ, డ్రోన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

ఇరాన్ అమెరికాకు చెందిన ఏ డ్రోన్‌ను కూల్చివేసింది?

ఇరాన్, అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్టు ప్రకటించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో 285 కోట్లకుపైగా విలువ చేస్తుంది.

ఇరాన్‌పై ట్రంప్ ఏ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు?

ట్రంప్ వైమానిక దాడులకు పరిమితమయ్యారని, ఇంకా దారికి రాకుంటే ఇరాన్‌లోనే సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే చమురు కొనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే చమురు కొనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget