Kolhi Vs RCB: కెప్టెన్సీ విషయంలో ఆర్సీబీది సరైన నిర్ణయమే.. కోహ్లికి ఆ రకంగా మేలు..
17 సీజన్లుగా ఆడుతున్న ఒక్క టైటిల్ గెలవకపోయినా, ప్రతి ఏడు ఆర్సీబీకి ఫ్యాన్ బేస్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఐపీఎల్ జరుగుతున్నప్పుడల్లా ఈ సాలా కప్ నమ్దే అనే స్లోగన్ వినిపించడం అలవాటే.

IPL 202 Latest Updates: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తాజాగా తమ కెప్టెన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 మెగావేలానికి ముందు ఆటగాళ్లను విడిచి పెట్టి విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్ లను రిటైన్ చేసుకుంది. ఇప్పుడు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రజత్ ను కెప్టెన్ గా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిజానికి గతేడాది కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను రిలీజ్ చేసినప్పుడే కోహ్లీని కెప్టెన్ గా ప్రకటిస్తారని అందరూ గెస్ చేశారు. అందరి అంచనాలను తల కిందులు చేస్తూ, రజత్ ను కెప్టెన్ గా ప్రకటించింది టీమ్ యాజమాన్యం. ఇక ఆర్సీబీ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సమర్థిస్తున్నాడు. ఈ నిర్ణయం కోహ్లీకి మేలు చేస్తుందని వ్యాఖ్యానించాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రికెట్ ఆడగలడని తెలిపాడు. గతేడాది టీ20ఐలకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆసక్తికరంగ ఉండబోతుంది వ్యాఖ్యానించాడు.
ఇండియన్ క్రికెట్ బ్రాండ్లు..
భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీలు భారత క్రికెట్ కు బ్రాండ్ల వాంటివారని, వచ్చే ఐపీఎల్ సీజన్లో ఇద్దరిపై కెప్టెన్సీ భారం లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడతారని మంజ్రేకర్ తెలిపాడు. వీరిద్దరూ గతేడాది టీ20ఐల నుంచి నిష్క్రమించారని, దీంతో మరింతగా ఫియర్ లెస్ క్రికెట్ ఆడతారని విశ్లేషించాడు. ఇక ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 17 సీజన్లుగా ఆడుతున్న ఒక్క టైటిల్ గెలవకపోయినా, ప్రతి ఏడు ఫ్యాన్ బేస్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆ జట్టు తరపున ఆడుతుండటంతో సీజన్ జరుగుతున్నప్పుడల్లా ఈ సాలా కప్ నమ్దే అనే స్లోగన్ వినిపించడం పరిపాటిగా మారిపోయింది. అందరూ ఊహించినట్లుగా కాకుండా రజత్ ను కెప్టెన్ గా ఎన్నుకుని షాకిచ్చింది. నిజానికి కోహ్లీని ఈ సీజన్ కు కెప్టెన్ గా చేస్తారని అందరూ భావించగా, అందుకే మెగావేలంలో శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లాంటి కెప్టెన్సీ మెటిరీయల్ ప్లేయర్లు ఉన్నప్పటికీ వారిని కొనుగోలు చేయలేదని విశ్లేషించారు. తాజా నిర్ణయంతో ఆర్సీబీ కొత్త వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది.
కోహ్లీకి కెప్టెన్సీ అవసరం లేదు..
నిజానికి తమ టీమ్ విషయానికి వస్తే కెప్టెన్సీపై పెద్దగా ఆలోచించబోమని జట్టు డైరెక్టర్ మో బొబాట్ పేర్కొన్నాడు. తామంతా జట్టుగా విజయాలు సాధిస్తామని భావిస్తామని, అందులో ప్రత్యేకంగా కెప్టెన్ గా ఎవరుండాలనే విషయంలో అంతగా ఆలోచించబోమని, క్రికెట్ అనేది టీమ్ ప్లే అని, దానికి కట్టుబడే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపాడు. మైదానంలో చురుకుగా కదిలి, యాక్టివ్ గా ఉండే కోహ్లీలాంటి ప్లేయర్ కు కెప్టెన్సీ అనే టైటిల్ అవసరం లేదని, నిత్యం జట్టును ముందుకు నడిపిస్తుంటాడని వ్యాఖ్యానించాడు. కోహ్లీలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, దీంతో రజత్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదని పేర్కొన్నాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

