By: Arun Kumar Veera | Updated at : 19 Feb 2025 10:12 AM (IST)
రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? ( Image Source : Other )
HDFC Bank Xpress Personal Loan Scheme: అత్యవసర వైద్య పరిస్థితి వచ్చినా, వివాహం చేయాలన్నా, ఇంటి మరమ్మతులు లేదా ఉన్నత చదువుల కోసమైనా... అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమైతే ప్రజలు బ్యాంక్ లోన్ మీద దృష్టి పెడతుంటారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకునే అప్పు మీద వడ్డీ కంటే, బ్యాంక్‌లు ఇచ్చే లోన్‌లపై మీద చెల్లించే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా, EMIల రూపంలో అసలు+వడ్డీ రెండూ తీరిపోతాయి. మీరు ఏదైనా అవసరంలో ఉండి, బ్యాంక్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే, HDFC బ్యాంక్ "ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్" స్కీమ్‌ను ప్రకటించింది.
HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ స్కీమ్ అంటే ఏమిటి?
ఇది అన్‌సెక్యూర్డ్ లోన్ (Unsecured Loan). ఈ రుణం తీసుకోవడానికి మీరు బ్యాంకు వద్ద ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోర్ & ఆదాయంపై సంతృప్తికరంగా ఉంటే HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్‌కు ఆమోదం లభిస్తుంది. ఈ లోన్ స్కీమ్ కింద, మీరు రూ. 40 లక్షల వరకు రుణం పొందవచ్చు.
మీ వయస్సు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటే, మీరు HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ క్రెడిట్ స్కోరు 720 పైన ఉంటే రుణం పొందడం సులభం అవుతుంది. దీంతో పాటు, మీ నెలవారీ ఆదాయం కనీసం రూ. 25,000 ఉండాలి. ఏదైనా ప్రైవేట్ కంపెనీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో కనీసం రెండు సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ వడ్డీ ఎంత?
HDFC బ్యాంక్ ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ విభాగంలో వడ్డీ రేట్లు 10.85 శాతం నుంచి 24.00 శాతం వరకు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజ్ రూ. 6,500 వరకు ఉండవచ్చు, దీనిపై GST అదనంగా చెల్లించాలి. ఇది కాకుండా, వివిధ రాష్ట్రాల్లో వర్తించే చట్టాల ప్రకారం స్టాంప్ డ్యూటీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీరు బ్యాంకు కస్టమర్ సర్వీస్ బృందాన్ని సంప్రదించవచ్చు.
రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు
* వ్యక్తిగత గుర్తింపు కార్డు (ఆధార్ వంటిది)
* చిరునామా రుజువు
* 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా 6 నెలల పాస్‌బుక్
* ఫామ్ 16తో పాటు 2 నెలల శాలరీ స్లిప్‌లు లేదా శాలరీ సర్టిఫికేట్
ఎలా దరఖాస్తు చేయాలి?
* HDFC బ్యాంక్ అధికారిక నెట్ బ్యాంకింగ్ లేదా యాప్‌లోకి లాగిన్ కావాలి
* అందులో, ఎక్స్‌ప్రెస్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకోండి
* మీ వృత్తిని ఎంచుకోండి
* మొబైల్ నంబర్, పుట్టిన తేదీ/పాన్ ద్వారా మిమ్మల్ని మీరు ధృవీకరించండి
* అక్కడ అడిగిన వ్యక్తిగత వివరాలు ఇవ్వండి
* మీ ఆదాయాన్ని ధృవీకరించండి
* లోన్ ఆఫర్‌లను తనిఖీ చేయండి
* ఆధార్ ఆధారిత KYC ని పూర్తి చేయండి
మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే, బ్యాంక్ దానిని పరిశీలించి & సంతృప్తి చెందితే మీకు లోన్ మంజూరు చేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: సైబర్ నేరగాళ్ల ఫోకస్ మీ పెన్షన్‌పై పడింది - ఒక్క క్లిక్‌తో మీ డబ్బంతా పోతుంది, జాగ్రత్త!
Credit Card Fraud: ఒక్క వీడియో కాల్‌తో రూ.9 లక్షలు స్వాహా - క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు జాగ్రత్త
Free Current: ఈ వేసవిలో AC వేసినా కరెంట్ బిల్లు రాదు, రోజంతా చల్లగా ఉండండి
Gold Hits All Time High: 10 గ్రాముల పసిడి కోసం లక్షలు ఖర్చు పెట్టాలా?, మూడు నెలల్లో మెగా ర్యాలీ
Education Loan: రూ.50 లక్షల విద్యారుణంపై టాప్-10 బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లు ఇవీ
Home Loan EMI Calculator: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఎంత EMI చెల్లించాలి, EMIని ఎలా లెక్కిస్తారు?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
పదమూడేళ్లకే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి... 18 ఏళ్లకు 50 ఏళ్ల సీఎంతో రెండో పెళ్లి, విడాకులు... సినిమాలు వదిలేసిన హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటీ?