అన్వేషించండి

Supreme Court: ఉపఎన్నికలకు మేం సిద్ధం - సుప్రీంకోర్టు నోటీసులతో కేటీఆర్ కీలక ప్రకటన

BRS: ఉపఎన్నికకు సిద్దంగా ఉన్నామని కేటీఆర్ ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడంతో అనర్హతా వేటు ఖాయమని కేటీఆర్ నమ్ముతున్నారు.

KTR announced that they are ready for the by election: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పడుతుందని.. తాము ఉపఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.  కాంగ్రెస్‌ ఫిరాయింపుదారులను ఇకపై రక్షించడం అసాధ్యమని ఆయన ట్వీట్ చేశారు.  

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడంతో ఈ విధంగా స్పందించారు.  గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,  ప్రకాష్ గౌడ్,  డాక్టర్ సంజయ్ కుమార్, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిది.  పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటి,న్ వేశారు.  కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హరీష్ రావు  వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది.  
ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణ జరిగే రోజే రెండో పిటిషన్‌పై విచారిస్తామని తెలిపింది. 

2023అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద వారిని అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో  చర్యలు తీసుకోవాలని  స్పీకర్‌ను ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ కార్యదర్శి హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉందని, దీనికి కాలపరిమితి లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే, స్పీకర్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.                     

రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించి కూడా ఆరు నెలలు గడిచినా స్పీకర్ ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని పిటిషనర్ ఎత్తి చూపారు. కనీసం వాళ్లు నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ కోరుతోంది.  ఎమ్మెల్యేలపై ఆయా పార్టీలు దాఖలు చేసిన ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలని కేశం మేఘ చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బిఆర్‌ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తదుపరి విచారణలో కీలక నిర్ణయాలను సుప్రీంకోర్టు తీసుకునే అవకాశం ఉంది. 

Also Read: Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BCCI Dream 11 Deal: డ్రీమ్ 11తో డీల్ రద్దు చేసుకుంటూ బీసీసీఐ కీలక నిర్ణయం
డ్రీమ్ 11తో డీల్ రద్దు చేసుకుంటూ బీసీసీఐ కీలక నిర్ణయం
AP DSC 2025 Call Letters: ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్
ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఫై పవన్ స్టాండ్ పైనే అందరి దృష్టి- 30 న వైజాగ్ లో జనసేన విస్తృత స్థాయి సమావేశం
స్టీల్ ప్లాంట్ ఫై పవన్ స్టాండ్ పైనే అందరి దృష్టి- 30 న వైజాగ్ లో జనసేన విస్తృత స్థాయి సమావేశం
Dindi - Chinchinada Bridge: ఈ 25, 26 తేదీల్లో దిండి - చించినాడ వంతెనపై రాకపోకలు బంద్.. అధికారుల ప్రకటన
ఈ 25, 26 తేదీల్లో దిండి - చించినాడ వంతెనపై రాకపోకలు బంద్.. అధికారుల ప్రకటన
Advertisement

వీడియోలు

RCB Management about Releasing Siraj | సిరాజ్ రిటెన్షన్ పై స్పందించిన RCB
Cheteshwar Pujara Retirement | క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన పుజారా
ABD on Iyer in Asia Cup 2025 | అయ్యర్‌ని సెలక్ట్ చేయకపోవడంపై డివిలియర్స్
Farmer Stopped CM Chandrababu Convoy | సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఆపడానికి ప్రయత్నించిన రైతు
Farmers Lock Officials in Rythu Vedika | Urea Shortage | అధికారులను బంధించిన రైతులు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BCCI Dream 11 Deal: డ్రీమ్ 11తో డీల్ రద్దు చేసుకుంటూ బీసీసీఐ కీలక నిర్ణయం
డ్రీమ్ 11తో డీల్ రద్దు చేసుకుంటూ బీసీసీఐ కీలక నిర్ణయం
AP DSC 2025 Call Letters: ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్
ఏపీ మెగా డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్
Pawan Kalyan: స్టీల్ ప్లాంట్ ఫై పవన్ స్టాండ్ పైనే అందరి దృష్టి- 30 న వైజాగ్ లో జనసేన విస్తృత స్థాయి సమావేశం
స్టీల్ ప్లాంట్ ఫై పవన్ స్టాండ్ పైనే అందరి దృష్టి- 30 న వైజాగ్ లో జనసేన విస్తృత స్థాయి సమావేశం
Dindi - Chinchinada Bridge: ఈ 25, 26 తేదీల్లో దిండి - చించినాడ వంతెనపై రాకపోకలు బంద్.. అధికారుల ప్రకటన
ఈ 25, 26 తేదీల్లో దిండి - చించినాడ వంతెనపై రాకపోకలు బంద్.. అధికారుల ప్రకటన
Crime News: దారుణం.. వివాహితను బంధించి, కడుపు మాడ్చటంతో ఎముకల గూడులా మారి మృతి
దారుణం.. వివాహితను బంధించి, కడుపు మాడ్చటంతో ఎముకల గూడులా మారి మృతి
Ghaati Movie: అనుష్క పవర్ ఫుల్ 'ఘాటి' - కర్ణాటకలో రిలీజ్ చేయనున్న స్టార్ హీరో మదర్
అనుష్క పవర్ ఫుల్ 'ఘాటి' - కర్ణాటకలో రిలీజ్ చేయనున్న స్టార్ హీరో మదర్
Bigg Boss Agnipariksha : అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 రివ్యూ.. ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చినా నీకు అంత సీన్ లేదు.. శ్రీజకు ఎడాపెడా వాయించిన నవదీప్
అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 రివ్యూ.. ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చినా నీకు అంత సీన్ లేదు.. శ్రీజకు ఎడాపెడా వాయించిన నవదీప్
Revanth Reddy: సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: రేవంత్ రెడ్డి
సినీ పరిశ్రమలో వివాదాలు వద్దు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: రేవంత్ రెడ్డి
Embed widget