అన్వేషించండి

Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక

Caste Census In Telangana | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల గణన సైతం పూర్తయింది. రాష్ట్రంలో అత్యధికంగా 46.25 శాతం మంది బీసీలు ఉన్నారని కుల గణన సర్వేలో తేలింది.

Telangana Samagra Kutumba Survey | హైదరాబాద్‌: తెలంగాణలో కుల గణన ప్రక్రియ ముగిసింది. ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనేది తేలింది. తెలంగాణలో అత్యధికంగా 46.25 శాతం బీసీలు ఉన్నారు. ఆతరువాత  ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం మంది ప్రజలు ఉన్నారని సమగ్ర సర్వేతో ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే (Telangana Caste Survey)లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే రిపోర్టును మంగళవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందే కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరగనుంది. 

పిబ్రవరి 4న కేబినెట్ ఆమోదం

తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న బీసీ ఉపసంఘానికి ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి, నోడల్‌ అధికారి సమగ్ర సర్వే నివేదికను ఆదివారం అందజేశారు. అనంతరం సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ‘అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేయడంలో భాగంగా సమగ్ర కుటుంబ సర్వేతో చారిత్రక అడుగు పడింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కులగణన కోసం సమగ్ర కుటుంబ సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చెప్పినట్లుగానే ఏడాదిలోగా సర్వే పూర్తి చేశాం. కుల గణన నివేదికను రూపొందించాం. సమగ్ర సర్వే నివేదికపై పిబ్రవరి 4న కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు అసెంబ్లీలో దీనిపై చర్చిస్తాం. తెలంగాణలోని అన్నివర్గాల వారికి ఉద్యోగ, రాజకీయ, ఇతర అన్ని రంగాలలో సమగ్ర న్యాయం జరుగుతుంది. సమగ్ర సర్వే నివేదిక వివరాలతో తెలంగాణలో అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయని’ మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

రాహుల్ ఇచ్చిన హామీ మేరకు కుల గణన

ఇండిపెండెన్స్ తరువాత 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల కోసం సర్వే చేసేవారు. కానీ కుల గణనను అందులో చేర్చలేదు. కానీ తెలంగాణ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏడాదిలోనే సర్వే పూర్తి చేశాం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కుల గణన కోసం 2024 ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకోగా, అదే నెల 16న శాసనసభ తీర్మానం చేసింది. ఏడాదిలోపే సర్వే పూర్తి చేసి, నివేదికను రూపొందించా. దీనిని ఫిబ్రవరి 4న అసెంబ్లీకి ప్రవేశపెట్టి సభ ఆమోదం తీసుకుంటాం.  

సమగ్ర ఇంటింటి సర్వేలో 1,03,889 మంది పనిచేశారు. 96.9 శాతం మంది (3.54 కోట్ల మంది) వివరాలు సమర్పించగా కేవలం 50 రోజుల వ్యవధిలో సమగ్ర సర్వే నివేదిక వచ్చింది. సర్వే సమయంలో అందుబాటులో లేని వారు, సర్వేకు దూరంగా ఉన్నవారు 3.1 శాతం (16 లక్షల మంది) ఉన్నారు. వేగంగా సర్వే పూర్తి చేసిన అధికారులు, క్షేత్ర స్థాయిలో పనిచేసిన వారికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. సర్వే సమయంలో 1.03 లక్షల గృహాలకు తలుపులు వేసి ఉండగా, 1.68 లక్షల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉండి వివరాలు ఇవ్వలేదు. బిహార్‌లో కులగణనకు 6 నెలలు సమయం పడితే, రూ.500 కోట్లు ఖర్చు అయింది. తెలంగాణలో కేవలం 50 రోజులలో అతి తక్కువ ఖర్చుతో ప్రభుత్వం సర్వే పూర్తి చేసిందని’ ఉత్తమ్‌ తెలిపారు. 

Also Read: Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య జ్యూడిషియల్ కమిషన్ ఇచ్చిన సిఫారసులపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు  సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, శ్రీమతి సీతక్క, ఎంపీ శ్రీ మల్లు రవి సచివాలయంలో వివరాలు వెల్లడిస్తారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు
ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు
ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Embed widget