అన్వేషించండి

Indiramma Atmiya Bharosa Scheme: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక అప్‌డేట్, వారిని అనర్హులుగా గుర్తిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Indiramma Atmiya Bharosa News : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై కీలక నిర్ణయం తీసుకుంది. భూమి ఉన్న వారిని అనర్హులుగా గుర్తిస్తోంది. లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసింది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చనుంది. ఈ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీకి ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గ్రామ సభల్లో, మండల కార్యాలయాల్లో జనవరిలో నాలుగు రోజులపాటు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి సైట్ క్లోజ్ చేస్తామని, మార్పులకు అవకాశం లేదని పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన డీఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేసింది.

మొత్తం 6 లక్షల లబ్దిదారులు
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వచ్చిన 2,24,487 దరఖాస్తుల్లో 19,193 అప్లికేషన్లకు ఓకే చేశారు. ఓవరాల్‌గా పలు కారణాలతో 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. మరో 59,542 దరఖాస్తులపై నిర్ణయం పెండింగ్‌లో ఉంది. వాటిలో మరో 5, 6 వేల వరకు అర్హులుగా మారతారని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ భరోసాకు 5,80,577 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 25 నుంచి 30 వేల మంది అర్హుల జాబితాలో చేరనున్నారు. ఉపాధి హామీ పథకం కింద 2023-24లో 20 రోజుల పని దినాలు పూర్తి చేసిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు.

భూమి ఉంటే పథకంలో పేరు రిజెక్ట్..
కుటుంబ యజమాని పేరిట గానీ, ఇతర కుటుంబసభ్యులకు గానీ ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అన్హరులు అవుతారు. కొన్ని అప్లికేషన్లు రిజెక్టు కావడంపై తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. కుటుంబ యాజమానికి, లేక కుటుంబంలో ఎవరికైనా 10 ఏళ్ల క్రితం భూమి అమ్ముకున్నా వారి పేర్లు రికార్డుల్లో  ఉండటంతో వారిని సైతం ఈ పథకానికి ఎంపిక చేయలేదు. వీరిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. భూమి విక్రయించినా, రికార్డుల్లో వారి పేరు ఉన్న వారిని ప్రస్తుతానికి లబ్దిదారులుగా ప్రభుత్వం గుర్తించడం లేదు. 

Also Read: Telangana Caste Survey: తెలంగాణలో ఏ సామాజిక వర్గం వారు ఎంత శాతం ఉన్నారు? లెక్కలు తేల్చిన ప్రభుత్వం, రేపు అసెంబ్లీకి సర్వే నివేదిక

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget