Baby John OTT: ఓటీటీలో కీర్తి సురేష్ హిందీ సినిమా ఫ్రీగా చూసేయవచ్చు... భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎందులో ఉందంటే?
Baby John OTT : వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్' ఎట్టకేలకు ఫ్రీగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే ?

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బేబీ జాన్' (Baby John). ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయగా, కీర్తి సురేష్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ హీరోయిన్ వామికా గబ్బి ఇందులో మరో హీరోయిన్ గా నటించింది. దళపతి విజయ్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందిన తమిళ మూవీ 'తెరి'కి హిందీ రీమేక్ గా తెరపైకి వచ్చింది 'బేబీ జాన్'. షారుఖ్ ఖాన్ 'జవాన్' తర్వాత హిందీలో డైరెక్టర్ అట్లీకి మంచి పాపులారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సమర్పణలో అట్లీ భార్య ప్రియ నిర్మాతగా, కలేష్ దర్శకుడిగా ఈ మూవీని రూపొందించారు. తాజాగా ఈ మూవీ ఫ్రీగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
'బేబీ జాన్' స్ట్రీమింగ్ ఫ్రీగా...
కీర్తి సురేష్ బాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని 'బేబీ జాన్' సినిమాలో నటించింది. ఈ మూవీ కోసం గ్లామరస్‌గా కనిపించారు. పైగా పెళ్ళయిన గంటల వ్యవధిలోనే ముంబైలో ప్రమోషన్స్ కోసం వాలిపోయింది. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. మూవీ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాలేదు. దీంతో 'బేబీ జాన్'తో కీర్తి సురేష్ చేసిన ఫస్ట్ ప్రయత్నమే ఫెయిల్ అయ్యి, ఆమె ఖాతాలో డిజాస్టర్ పడింది. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చింది.
ఫిబ్రవరి 5 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే రూ. 349 కట్టి చూడలంటూ, రెంట్ ఆప్షన్ లో అందుబాటులో ఉంచారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ప్రైమ్ సబ్ స్క్రైబర్లకు ఉచితంగానే ఈ మూవీని చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కానీ ఈ మూవీని కేవలం హిందీలో మాత్రమే ఓటీటీలోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ వెర్షన్లు మాత్రం చూసే ఛాన్స్ లేదు. కాగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో జాకీ ష్రాఫ్ విలన్ గా నటించారు. ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్, సినీ వన్ స్టూడియోస్ బ్యానర్లపై ప్రియా అట్లీ, మురాద్ ఖేతాని, జ్యోతి దేశ్ పాండే సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు.
'బేబీ జాన్' కథ ఏంటంటే?
జాన్ ఒక సింగిల్ పేరెంట్. అతనికి ఖుషి అనే పాప ఉంటుంది. పాపను స్కూల్లో వదిలేసిన తర్వాత అతను బేకరీలో పనులు చేసుకుంటూ గడుపుతాడు. ఎదుటి వ్యక్తిని పళ్ళెత్తు మాట అనడు, పైగా కోప్పడడం కూడా చేతగాని పిరికి వ్యక్తి. అసలు అతని గతం ఏంటి ? ముంబైలో రౌడీ మూకల భరతం పట్టిన ఐపీఎస్ ఆఫీసర్ సత్యా కేరళలో జాన్ గా ఎందుకు సెటిల్ అయ్యాడు? నానాజీకి, సత్యకి మధ్య ఉన్న గొడవేంటి ? సత్య భార్య ఎవరు? అనేది కథ.
Also Read: ఎన్టీఆర్ - నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ వారమే - లేటెస్ట్ అప్డేట్ తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

