ICC Champions Trophy: మెగాటోర్నీపైనే వన్డేల భవితవ్యం..! రోకోకు ఇదే ఆఖరు ఐసీసీ టోర్నా..? పాల్గొంటున్న జట్ల బలాబలావే..!
Rohit Sharma: ఈ ఫార్మాట్ విజయవంతమైతే మరికొంతకాలం వన్డే క్రికెట్ కి మనుగడ. చిన్నాచితకా తప్ప పెద్ద జట్లు వన్డేలను ఎక్కువగా ఆడట్లేదు. గతేడాది భారత్ కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది.

Virat Kohli News: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఎట్టకేలకు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వా త బుధవారం ప్రారంభం కానుంది. ఈ టోర్నీ నిర్వహణతో 29 ఏళ్ల తర్వాత పాక్ తిరిగి ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోంది. చివరిసారిగా బారత్, శ్రీలంకలతో కలిసి 1996 వన్డే ప్రపంచకప్ ను నిర్వహించింది. ఇటీవల కాలంలో ఏ టోర్నీకి లేనన్ని వివాదలు ఈ టోర్నీని చుట్టుముట్టాయి. ముఖ్యంగా భారత జట్టు పాక్ లో పర్యటించడంపై పీఠముడి బిగుసుకుంది. ఎట్టకేలకు ఐసీసీ జోక్యం చేసుకుని, హైబ్రీడ్ మోడల్లో ఈ టోర్నీని నిర్వహిస్తోంది. అంటే భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం దుబాయ్ లో మిగతా జట్ల మ్యాచ్ లు పాక్ లోనే జరుగుతాయి. ఇక ఈ ఫార్మాట్ విజయవంతమైతే మరికొంతకాలం వన్డే క్రికెట్ మనుగడ సాగిస్తోంది. ఇప్పటికే చిన్న చితకా జట్లు తప్ప పెద్ద జట్లు వన్డేలను ఎక్కువగా ఆడటం లేదు. గతేడాది భారత్ కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడటం గమనార్హం. కాసులు కురిపించే పొట్టి క్రికెట్ తోపాటు క్రేజ్ ఏమాత్రం తగ్గని టెస్టుల నిర్వహణకే బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు మొగ్గు చూపుతున్నాయి. ఐదేసి మ్యాచ్ ల చొప్పున టీ20లు, టెస్టు సిరీస్ లను నిర్వహిస్తున్న ఈ బోర్డులు.. వన్డేలను మాత్రం తూతూమంత్రంగా మూడు మ్యాచ్ లతో సిరీస్ లను నిర్వహిస్తున్నాయి. మెగాటోర్నీ విఫలమైతే వన్డేలను కూడా రెగ్యులర్ గా చూసే అవకాశముంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులు వన్డేల పట్ల అంత ఆసక్తితో లేరు. ఈ మెగాటోర్నీ ద్వారా ఏదైనా అద్భుతాలు జరుగుతాయో చూడాలి.
రోకో ద్వయానికి ఇదే ఆఖరు..
రోకోగా పేరు గాంచిన భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లకు ఇదే ఆఖరు ఐసీసీ టోర్నీగా నిలవనుంది. ఇప్పటికే వీళ్ల ఫామ్, ఆటతీరు అంతంతమాత్రంగా ఉండటంతో మరో ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది 2026 టీ20 ప్రపంచకప్ ఉన్నా, ఆ ఫార్మాట్ కు వీరిద్దరూ ఇప్పటికే గుడ్ బై చెప్పారు. ఇక వన్డే ప్రపంచకప్ 2027లో ఉన్నా, అప్పటివరకు ఫామ్ కాపాడుకుని, ఇదే ఉత్సాహంతో వీరిద్దరూ బరిలోకి దిగేది డౌటే. అప్పటికి రోహిత్ 40వ పడిలోకి చేరుకోగా, కోహ్లీ 39వ పడిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ టోర్నీలో సత్తా చాటి, మరో ఐసీసీ టోర్నీని ముద్దాడాలని ఈ ద్వయం భావిస్తోంది. ఒకవేళ ఈ టోర్నీని భారత్ నెగ్గితే, వీరిద్దరి నుంచి ఆశ్చర్యకరమైన నిర్ణయాలు (రిటైర్మెంట్)లాంటివి కూడా రావచ్చు.
గంభీర్ కు కీలకం..
గతేగాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల చేతిలో చావుదెబ్బ తిన్న భారత్.. ఈ ఏడాది ఇంగ్లాండ్ పై లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ సిరీస్ ల్లో సత్తా చాటింది. ప్రస్తుతానికి గంభీర్ పరిస్థితి బాగానే ఉన్నా, మెగాటోర్నీలో టీమ్ విఫలమైతే మాత్రం అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. గతేడాది ప్రదర్శనపై ఇప్పటికే గంభీర్ పై వ్యతిరేకత రాగా, ఈ మెగాటోర్నీలో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించడం తప్పనిసరి. లేకపోతే అతనిపై వేటు తప్పకపోవచ్చు. ఈ టోర్నీలో జట్ల విషయానికొస్తే, బలహీన జట్టుతో ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఐసీసీ టోర్నీ అంటే రెచ్చిపోయే ఈ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. గత కొంతకాలంగా ఆటతీరుతో విమర్శల పాలవుతున్న ఇంగ్లాండ్.. వన్డేల్లో ప్రమాదకరమైన జట్టు. హిట్టర్లతో నిండిన ఈ జట్టు తమదైన రోజున ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. సౌతాఫ్రికా బలంగానే ఉన్నా, బ్యాడ్ లక్కును జేబులో పెట్టుకుని తిరుగుతుంది. ఈ సారైన ఐసీసీ టోర్నీని దక్కించుకోవాలని భావిస్తోంది. ఆఫ్గానిస్థాన్ మ్యాగ్జిమం నాకౌట్ వరకు చేరవచ్చు.
ఆతిథ్య పాక్.. బలహీనంగానే కనిపిస్తున్నా.. సొంతగడ్డ అనుకూలత కలిసి రావచ్చు. అస్థిరమైన ఆటతీరుకు కేరాఫ్ అడ్రస్ అయిన పాక్.. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పడం కష్టం. న్యూజిలాండ్ ఇటీవల మంచి ఆటతీరును కనబరుస్తున్న ఫైనల్లో తడబడే అలావాటుంది. ఈ బలహీనతకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఆఫ్గాన్ లాగే ఆటలో అరటిపండులా ఈ జట్టును పేర్కొనవచ్చు. మ్యాగ్జిమం నాకౌట్ కు చేరే అవకాశముంది, కానీ కష్టమే. ఇక టైటిల్ ను దక్కించుకోడానికి అన్ని రకాలుగా భారత్ కు అవకాశాలున్నాయి. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్, జట్టు నిండా ఆల్ రౌండర్లు, ఒకే వేదిక పై టోర్నీ అంతా ఆడటం, జట్టంతా సూపర్ ఫామ్ లో ఉండటం సానుకూలాంశాలు. అయితే స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తే టోర్నీని ఈజీగా కైవసం చేసుకుంటుంది. ఈనెల 19 నుంచి పాక్-కివీస్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమవుతుండగా, 20న బంగ్లాదేశ్, 23న పాక్, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

