(Source: ECI | ABP NEWS)
New Alto K10 Price: కొత్త ఆల్టో 100 కిలోల బరువు తగ్గుతుంది, ధర దిగి రావచ్చు - 30 కి.మీ. మైలేజీ కూడా!
New Alto K10 Kerb Weight: మారుతి సుజుకి ఆల్టో ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మోడల్‌లో చాలా మార్పులు కనిపించాయి. ముఖ్యంగా బరువును భారీగా వదిలించుకుంది.

Maruti Alto K10 10th Gen Specifications: మారుతి సుజుకి భారత మార్కెట్‌లో అత్యంత పాపులర్ కార్ కంపెనీ. ఆ కంపెనీ ఎంట్రీ లెవల్ కారు మారుతి ఆల్టో K10. దీని ఎక్స్ షోరూమ్ ధర (Alto K10 ex-showroom price) రూ. 4.23 లక్షలు. ఇప్పుడు, ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అప్‌డేట్ అయింది. మారుతి ఆల్టో K10 మోడల్ మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి.
కంపెనీ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఆల్టో మోడల్‌లో చాలా మార్పులు కనిపించాయి. ఇటీవల, ఆల్టో బరువు విషయంలో కంపెనీ ఒక పెనుమార్పు తీసుకువచ్చింది. మారుతి సుజుకి తన టెన్త్ జనరేషన్ ఆల్టో (10th Generation Alto) బరువును దాదాపు 100 కిలోలు తగ్గించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నివేదికల ప్రకారం, మారుతి సుజుకి 2026లో కొత్త 10వ తరం ఆల్టో మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చు.
కొత్త తరం ఆల్టో బరువు ఎంత?
మారుతి సుజుకి, ఫస్ట్ జనరేషన్ ఆల్టో మోడల్‌ను విడుదల చేసినప్పుడు దాని బరువు 545 కిలోలు. ప్రస్తుతం, 9వ తరం ఆల్టో కార్ రోడ్లపై పరుగులు తీస్తోంది, దాని బరువు 680 కిలోలు. అయితే.. తదుపరి మోడల్ బరువు 580 కిలోలు ఉంటుందని సుజుకి తెలిపింది. బరువును తగ్గించడానికి, కారులో ఉపయోగించే వివిధ భాగాల స్థానంలో తేలికగా ఉండే మెటీరియల్‌ను ఉపయోగించవచ్చు. బరువు తగ్గడం వల్ల న్యూ ఆల్టో మైలేజ్ (10th Gen Alto K10 Mileage) కూడా 30 కి.మీ.లకు మెరుగుపడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు టెన్త్ జనరేషన్ ఆల్టో ధర (10th Gen Alto K10 Price) కూడా తగ్గే అవకాశం ఉంది.
కొత్త అప్‌డేట్‌తో మారుతి ఆల్టో K10 లాంచ్
మారుతి ఆల్టో K10 కీలక అప్‌డేట్‌తో వచ్చింది. ఇంతకుముందు, ఈ కారులో డ్రైవర్‌తో పాటు ముందు సీట్‌లో కూర్చున్న ప్రయాణీకుడి కోసం రెండు ఎయిర్ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు, వెనుక సీట్‌లోని ప్రయాణీకుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని 6 ఎయిర్ బ్యాగ్‌లు (6 Airbags In Maruti Alto K10) అందిస్తున్నారు. అంతేకాదు.. కారులో వెనుక పార్కింగ్ సెన్సార్లు, బ్యాక్ సీట్ ప్రయాణీకుల కోసం సీట్ బెల్టులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), యాంటీ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
జపనీస్ వాహన తయారీదారు కొత్త ఆల్టోలో ఎలాంటి మెకానికల్ ఛేంజెస్ చేయలేదు. మారుతి ఆల్టో K10 మోడల్ 998 CC K10C పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది, 5,500 rpm వద్ద 49 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3,500 rpm వద్ద 89 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కారు ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వస్తుంది. మారుతి కారులో 27 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంది. ఈ కారు పెట్రోల్ & CNG రెండు వేరియంట్లలోనూ మార్కెట్లో లభిస్తుంది.





















