Globetrotter Event: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్... ఒక్కటి కాదు, మూడు సర్‌ప్రైజ్‌లు... మహేష్ - రాజమౌళి మూవీ ఫంక్షన్ డీటెయిల్స్ తెలుసా?
Globetrotter Event Passes Details: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న SSMB29 ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ ముస్తాబైంది. అక్కడ జక్కన్న మూడు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్టు తెలిసింది.

Rajamouli - Mahesh Babu movie SSMB29 Globetrotter event: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ రోజు (శనివారం, నవంబర్ 15న) రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్ ఏ సమయానికి మొదలు అవుతుంది? పాసులు ఉన్న వాళ్ళు ఏ సమయానికి చేరుకోవాలి? ఈవెంట్ దగ్గరకు వెళ్లలేని వాళ్ళు ఎక్కడ చూడాలి? వంటి వివరాలు తెలుసుకోండి.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్...
పాస్ పోర్టులు ఉన్న వాళ్ళకు ఎంట్రీ!
సాధారణంగా ఈవెంట్స్ కోసం పాసులు రెడీ చేస్తారు. బట్ ఫర్ ఏ ఛేంజ్... జక్కన్న & టీమ్ పాస్ పోర్టులు రెడీ చేసింది. సినిమా స్టార్ట్ చేయడానికి ముందు, చిత్రీకరణ ప్రారంభించేటప్పుడు మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేసినట్టు రాజమౌళి చేసిన పోస్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈవెంట్ కోసం పాస్ పోర్ట్ రెడీ చేసి ఇస్తున్నారు. ఎల్లో, ఆరెంజ్, పింక్... మూడు నాలుగు రకాల పాస్ పోర్టులు రెడీ చేశారు. పాస్ పోర్ట్ రంగును బట్టి అక్కడ సీటింగ్ ఉంటుంది అన్నమాట.
ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఈవెంట్!
ఇండియాలో జియో హాట్‌స్టార్... మరి బయట?
Globetrotter event time in India - streaming platform: మహేష్ - రాజమౌళి మూవీ సినిమా ఫస్ట్ ఈవెంట్ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ స్ట్రీమింగ్ రైట్స్ జియో హాట్ స్టార్ ఓటీటీ తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి ఈవెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ప్రముఖ హాలీవుడ్ మూవీ సంస్థ 'వెరైటీ' యూట్యూబ్ ఛానల్‌లోనూ ఈవెంట్ లైవ్ ఇవ్వనున్నారు. అయితే ఆ లైవ్ కేవలం ఇండియా వెలుపల మాత్రమే. మన దేశంలో ఉన్న ప్రజలు జియో హాట్ స్టార్ ఓటీటీలో చూడాలి.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
ఈవెంట్ ఏడు గంటలకు కనుక పాస్ పోర్టులు ఉన్నవాళ్ళు ఆ సమయానికి రామోజీ ఫిల్మ్ సిటీకి ఆ టైంకు చేరుకునేలా ప్లాన్ చేస్తే ఇబ్బంది పడతారు. అందుకని రెండు గంటలు ముందుగా వెళ్ళడం మంచిది.
మహేష్ బాబుతో పాటు ఎవరెవరు వస్తారు?
ఈవెంట్‌లో సందడి చేయబోయేది ఎవరు??
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సందడి చేయడం గ్యారెంటీ. వాళ్ళతో పాటు సినిమాలో మందాకినీ పాత్రలో నటిస్తున్న ప్రియాంక చోప్రా కూడా హాజరు కానున్నారు. ఆవిడ సైతం హైదరాబాద్ సిటీలో ఉన్నారు. సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి - 'సంచారి' పాడిన శృతి హాసన్ - కాలభైరవ లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
మూడు సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసిన రాజమౌళి!
ఎస్ఎస్ఎంబి 29 నుంచి కుంభ పాత్రధారి పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినీగా ప్రియాంక చోప్రా లుక్, 'సంచారి సంచారి' సాంగ్ విడుదల చేశారు. ఆ మూడింటినీ ఈవెంట్‌లో ప్రదర్శిస్తారు. అవి కాకుండా మరో మూడు సర్‌ప్రైజ్‌లు రాజమౌళి ప్లాన్ చేశారని సమాచారం. అందులో మొదటిది... టైటిల్ రివీల్. సినిమా పేరును ఈ రోజు అనౌన్స్ చేయనున్నారు. రెండోది... హీరో పేరు & ఫస్ట్ లుక్. సినిమాలో మహేష్ పేరు రుద్ర అని తెలుస్తోంది. ఆ పేరుతో లుక్ విడుదల చేయనున్నారట. ఇక మూడో సర్‌ప్రైజ్ ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మేకింగ్ వీడియో ప్రదర్శించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...






















