అన్వేషించండి

Bappm TV: I bomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు -కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ నిర్వహణ

Bappm TV:దమ్ముంటే పట్టుకోన్నాడు, పట్టుకున్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడు పోలీసులకు చిక్కాడు. విదేశాల్లో ఉంటూ తెలుగు, హింది, తమిళ ఇతర భాషా చిత్రాలను పైరసీ చేస్తూ వచ్చాడు.

I Bomma :సినిమాలను, వెబ్‌సిరీస్‌లను పైరసీ చేస్తూ వెబ్‌సైట్‌లో పెట్టిన ఐ బొమ్మ(ప్రస్తుతం బప్పమ్‌ టీవీ) నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. పైరసీ విషయంలో పోలీసులకు గతంలో అతను సవాల్ చేశాడు. దమ్ముంటే పట్టుకోవాలని, అందరి పర్శనల్‌ వివరాలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఈ బెదిరింపును పోలీసులు సీరియస్‌గా తీసుకొని ఇన్నిరోజులు కాపు కాసి ఆయన్ని పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని కుకట్‌పల్లిలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలను అదే రోజు వెబ్‌సైట్‌లో పెడుతూ తీవ్ర చర్చనీయాంశమైందీ ఐ బొమ్మ పైరేడెట్‌ వెబ్‌సైట్‌. ఈ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ వెబ్‌సైట్‌పేరు సినిమా నిర్మాతల మధ్య చర్చకు వచ్చేది. పోలీసులకు నిర్మాతల మండలి ఫిర్యాదులు చేసేది. కానీ ఇంత వరకు సీరియస్‌గా యాక్షన్ తీసుకున్నది లేదు. ఈ మధ్యకాలంలో సినిమా పరిశ్రమ నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు గట్టి చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా నెల రోజుల క్రితం కీలకమైన ఓ ముఠాను అరెస్టు చేశారు.

ఐదుగురు సభ్యులు ఉన్న ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా అప్పటి సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ పైరసీ వెబ్‌సైట్‌లు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించినా సరే పట్టుకుంటామని అన్నారు. ముఖ్యంగా ఐ బొమ్మ వంటి సంస్థలను వదిలిపెట్టేదేలేదని హెచ్చరించారు. పోలీసులు ఈ హెచ్చరిక జారీ చేసిన వెంటనే ఐబొమ్మ పోలీసులకు సవాల్ చేసింది. దమ్ముంటే తమను పట్టుకోవాలని ఛాలెంజ్ చేసింది. తమను పట్టుకుంటే ఎవరిని ఎక్కడ ఫోకస్ చేయాలో తమకు తెలుసని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తమ దగ్గర చాలా మంది ప్రైవేటు డేటా ఉందంటూ బెదిరింపులకు దిగింది. మొత్తాన్ని ఇన్ని రోజులు విచారణ చేసిన పోలీసులు కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచి ఈ పైరసీ సినిమాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చారు.

ఫ్రాన్స్‌లో ఉంటూ సినిమా వాళ్లకు చుక్కలు చూపించాడు రవి. ఫ్రాన్స్ నుంచి వచ్చిన వెంటనే ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. థియేటర్లలో లేదా OTTలో సినిమా రిలీజ్ అయిన వెంటనే అప్‌లోడ్ చేస్తున్నాడు. దీనివల్ల సినిమా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌పై వందల ఫిర్యాదులు ఉన్నాయి. వీళ్లంతా కూడా విదేశాల్లో ఉంటూ సినిమాలు పైరసీ చేస్తుండటంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్లు దేశానికి వచ్చినప్పుడు మాత్రమే అరెస్టు చేయగలుగుతున్నారు. పైరసీ ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ఇది కూడా కారణమని పోలీసులు చెబుతున్నారు.

రవి భార్య నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించాడు. మఖ్యంగా కరేబియన్ దీవుల నుంచి వెబ్‌సైట్‌ను మేనేజ్ చేస్తూ వచ్చాడు. ఈ విషయాలు తెలిసినప్పటికీ పోలీసులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆయన్ని అరెస్టు చేసిన తర్వాత కీలక విషయాలు తెలుసుకున్నారు. అతని వద్ద లెటెస్ట్ సినిమాలకు సంబంధించిన వివరాలు, ప్రింట్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన అకౌంట్‌లో ఉన్న 3 కోట్ల రూపాయలను కూడా అధికారులు ఫ్రీజ్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
ఆదివారం టాప్ 10 ఓటీటీ మూవీస్ - ఈ 4 సినిమాలు డోంట్ మిస్
Idupu Kayitham Ullipoola Song : ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
ఉల్లిపూల సీరే గట్టి... ఉత్తరాది సెరువే దాటి - ఇడుపు కాయితం తెలంగాణ క్యూట్ సాంగ్ లిరిక్స్
Arjun Sarja : ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
ఆపరేషన్ సింధూర్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా - అర్జున్ పాన్ ఇండియా హిస్టారికల్ ప్రాజెక్ట్
Ram Charan Sukumar : చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!
చరణ్ మూవీలో హీరోయిన్ సాత్వికనేనా? - ఆడిషన్ ఇచ్చింది ఏ భారీ ప్రాజెక్ట్ కోసం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thiruparankundram Deepam: తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
తిరుప్పరంకుండ్రం రాతిస్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం.. కన్నీళ్లు పెట్టుకున్న భక్తులు
PM Modi: మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై ప్రధాని మోదీ
మా సంకల్పం అచంచలమైనది, ధైర్యంగా అడుగేద్దాం: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై PM Modi
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
విశాఖ కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా, విద్యార్థులకు గాయాలు - ఘటనపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆరా
MP Seats In AP and Telangana: గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
గత డీలిమిటేషన్‌తో తగ్గిన సీట్లు.. కొత్త బిల్లుతో ఏపీ, తెలంగాణలో వచ్చే సీట్లు ఎన్నో తెలుసా..
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
పుప్పాలగూడలో అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యం.. కబ్జా చేసి రోడ్డు నిర్మాణంపై బాధితుల ఆగ్రహం
Adilabad News: జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
జాబ్ మానేసి బ్రోకలీ సాగు, ఆదిలాబాద్ యువ రైతుకు అధిక లాభాలు.. ఆదర్శంగా నిలుస్తున్న శివశంకర్
Rohit Sharma - Pollard Combo: కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
కొత్త కోచ్‌ పొలార్డ్ పై MI కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. సరైన వ్యక్తి అతడేనంటూ ప్రశంసలు
Delimitation Bill 2026: డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
డీలిమిటేషన్ బిల్లు 2026.. ఇండియా కూటమికి స్టాలిన్, పవార్ షాక్ ? కేంద్రం పంతం నెగ్గుతుందా
Embed widget