AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
IPL లో బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. బెట్టింగ్స్ ఆడే వాళ్ళనీ వదిలేది లేదు యువత అప్రమత్తంగా ఉండాలని ఏపీ డీజీపీ వార్నింగ్ స్పష్టం చేసారు.

క్రికెట్ బెట్టింగులు జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండని యువతకు సూచించారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, పందెం రాయుళ్లుపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎవరేంచేస్తున్నారో అంతా గమనిస్తున్నామని, బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని సీరియస్ గా తెలిపారు. బెట్టింగ్ ముఠాల కార్యకలాపాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన క్రికెట్ బెట్టింగులు పాల్పడడమే కాదు డానికి ఏవిధంగా సహకరించినా కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టం చేసారు.
IPL సీజన్ లో జాగ్రత్తగా ఉండండి.. బెట్టింగ్ రాయుళ్లకు ఏపీ డీజీపీ వార్నింగ్
ఐపీఎల్ క్రికెట్ సీజన్ మొదలైన నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అమాయక ప్రజలను యువతను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారిని ప్రలోభ పెట్టి క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని డీజీపీ హరీష్ ఒక ప్రకటన రిలీజ్ చేసారు. అలాంటి వారిని వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని డిజిపి హెచ్చరించారు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ బెట్టింగులు, బుకీల కదలికలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపిన అయన అందరినీ గమనిస్తున్నట్టు చెప్పారు.
క్రికెట్ బెట్టింగులు నిర్వహించే వ్యక్తుల సమగ్ర సమాచారం పోలీస్ శాఖ వద్ద ఉందని అన్న ఆయన బెట్టింగులు నిర్వహించి తప్పించుకుందామనే భ్రమల్లో ఉండొద్దని వార్నింగ్ ఇచ్చారు. వినోదం కోసమే క్రికెట్ చూడాలని, బెట్టింగుల వైపు ప్రజలు మొగ్గుచూపుకూడదని దానివల్ల కుటుంబాలు నాశనం అవుతాయని చెప్పారు.అప్పులు చేసి బెట్టింగులు పెట్టి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దు అన్నారు ఏపీ పోలీసులు.డైరెక్ట్ బెట్టింగ్,ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల పట్ల యువత మరియు విద్యార్థులు ఎక్కువుగా ఆకర్షితులు అవుతున్నారని వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు హరీష్ కుమార్ గుప్తా.
బెట్టింగ్ మాఫియా ట్రాప్ లో పడొద్దు.. యువతకు ఏపీ పోలీసుల సూచన
యువత బెట్టింగ్ మాఫియా వలలో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపే పోలీసులు సూచించారు. క్రికెట్ బెట్టింగులు పాల్పడినా, సహకరించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియచేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
బెట్టింగ్ ముతాల చేతిలో మోసపోయిన వాళ్ళు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు. IPL సీజన్ పేరు చెప్పి జోరుగా బెట్టింగ్ లు నిర్వహించడానికి కొంతమంది ద్రోహులు సమయాత్తం అవుతున్న సమాచారం మేరకు ఏపీ పోలీసులు అలాంటివి జరగకుండా ఆపడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కాబట్టి స్టూడెంట్స్ టీనేజర్స్ "బెట్టింగులు వేసినా మమ్మల్ని ఎవరూ గమనించట్లేదని భ్రమల్లో మాత్రం ఉండొద్దు " అని బెట్టింగులు కాస్తూ పోలీసులకు దొరికితే జీవితమే నాశనం అవుతుందని సామాజికవేత్తలు కూడా హితవు పలుకుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

