Upcoming Telugu Movies: ఫెస్టివల్ టైంలో ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చేసెయ్యండి - ఈ వారం థియేటర్, ఓటీటీల్లోకి వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
Latest Telugu Releases: ఈ వారం మాస్, యాక్షన్, లవ్, కామెడీ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఓటీటీల్లోనూ కొత్త మూవీస్ రానున్నాయి. ఆ జాబితా ఓసారి చూస్తే..

Latest Upcoming Movies In March 2025 Last Week: ఈ ఉగాది, రంజాన్ పండుగలకు బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర కనిపించనుంది. మార్చి చివరి వారంలో సినీ ప్రియులను ఎంటర్‌టైన్ చేసేందుకు మాస్, యాక్షన్, పాలిటిక్స్, కామెడీ మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఇటు థియేటర్స్, అటు ఓటీటీల్లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం రిలీజ్ కానున్న మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే..
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్..
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'లూసిఫర్ 2: ఎంపురాన్'. ఈ మూవీకి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. 2019లో సంచలన విజయం సాధించిన 'లూసిఫర్' మూవీకి సీక్వెల్‌గా ఇది రానుంది. యాక్షన్, ఎమోషన్, పాలిటిక్స్ అన్నీ కలగలిపిన ఈ మూవీ ఈ నెల 27 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్‌లో స్టీఫెన్, ఖురేషీల గురించి చూపించగా సెకండ్ పార్ట్‌లో వాళ్ల హిస్టరీ చూపించబోతున్నారు. ఈ సినిమాను తెలుగులో చూడాలని పృథ్వీరాజ్ ఇటీవలే ప్రెస్ మీట్‌లో చెప్పడంతో భారీగా హైప్ నెలకొంది.
చియాన్ యాక్షన్ చూస్తారా..
చియాన్ విక్రమ్ హీరోగా ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'వీర ధీర శూర'. ఈ సినిమాలో దుషారా విజయన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, ఎమోషన్స్ అన్నీ కలిపి విక్రమ్ మాస్ ఎలివేషన్స్‌తో అదరగొట్టినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ నెల 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈ మాస్ యాక్షన్‌ను చూసి ఎంజాయ్ చేసెయ్యండి.
నితిన్ యాక్షన్ 'రాబిన్ హుడ్'
యంగ్ హీరో నితిన్ (Nithiin), స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) లీడ్ రోల్స్‌లో నటించిన అవెయిటెడ్ మూవీ 'రాబిన్ హుడ్'. యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్‌లో నటించారు.
ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్
'మ్యాడ్'తో ముగ్గురు యువకుల అల్లరి మనల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తోంది 'మ్యాడ్ స్క్వేర్'. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో.. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న మళ్లీ నవ్వులు పంచేందుకు థియేటర్లలోకి రానుంది.
కండల వీరుడి యాక్షన్ మూవీ..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మంధన్న ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ 'సికిందర్'. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీల్లోనూ సినిమాల పండుగే..
- 'ఆహా' - ధనుష్ మూవీ 'ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' (తెలుగు) - మార్చి 26
- అమెజాన్ ప్రైమ్ వీడియో - హాలెండ్ - మార్చి 27
- జియో హాట్ స్టార్ - ముఫాసా: ద లయన్ కింగ్ (హిందీ/తెలుగు) - మార్చి 26
- జీ5 - విడుదల పార్ట్ 2 (హిందీ) మార్చి 28
- నెట్‌ఫ్లిక్స్ - మిలియన్ డాలర్ సీక్రెట్ (రియాల్టీ షో) - మార్చి 26
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

