అన్వేషించండి
Sivaji: మంగపతికి మెగాస్టార్ చిరంజీవి సత్కారం - లవ్ యూ అన్నయ్య అంటూ సెల్ఫీలు
Sivaji As Mangapathi: 'కోర్ట్' మూవీలో మంగపతిగా నటించి మెప్పించిన నటుడు శివాజీని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనతో శివాజీ సెల్ఫీలు దిగారు. లవ్ యూ అన్నయ్య అంటూ ఫోటోలు షేర్ చేశారు.
చిరంజీవితో శివాజీ సెల్ఫీలు
1/4

నటుడు శివాజీని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా శివాజీ ఆయనతో సెల్ఫీలు దిగారు. కోర్ట్ మూవీ చూసిన మెగాస్టార్ శివాజీని తన నివాసానికి పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించారు.
2/4

కోర్ట్ మూవీలో మంగపతిగా శివాజీ నటన అద్భుతమంటూ చిరంజీవి ప్రశంసించారు. చాలా రోజుల తర్వాత చిరంజీవిని కలవగా శివాజీ సెల్ఫీలు దిగారు.
3/4

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 'ఈ క్షణం నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతుంది. నా ప్రియమైన అన్నయ్య ఈ మంగపతిని, కోర్ట్ టీంను అభినందించడం సంతోషంగా ఉంది. లవ్ యూ అన్నయ్యా' అని పేర్కొన్నారు.
4/4

కోర్ట్ మూవీలో శివాజీ విలన్ రోల్‌లో మంగపతిగా అదరగొట్టారు. ఆయన నటనకు ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. నాని నిర్మాతగా వ్యవహరించగా.. ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది.
Published at : 30 Mar 2025 10:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















