అన్వేషించండి

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ

మీకెప్పుడైనా గుడికెళ్లాలి అనుకుంటే.. ఏ శివుడి గుడికో, రాముడి గుడికో, కృష్ణుడి గుడికో, అమ్మవారి ఆలయానికో వెళ్తారు. కానీ.. ఎప్పుడైనా ఏలియెన్ ఆలయానికి వెళ్లారా? సాధారణంగా గర్భగుడిలో ఏ శివలింగమో, రాముడి విగ్రహమో, కృష్ణుడి ప్రతిమో.. ఉంటుంది. కానీ.. గర్భగుడిలో ఏలియెన్ ప్రతిమకి పూజలు జరిగే ఆలయం కూడా ఒకటుందంటే నమ్ముతారా? వినకపోతే పదండి ఈ రోజు మిస్టరీ టూ హిస్టరీలో అలాంటి ఆలయం గురించే తెలుసుకుందాం.

తమిళనాడులోని సేలం జిల్లా లోని మల్లమూపం బట్టి గ్రామంలో ఓ ఆలయం ఉంది. ఈ ఆలయం వల్లే ఆ గ్రామం మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆ ఆలయంలో హిందూ దేవీ దేవతలు కాదు.. ఓ ఏలియన్‌కి పూజలు జరుగుతుంటాయి. లోగనాథన్ అలియాజ్ సిద్ధర్ భాగ్య అనే ఓ ఆధ్యాత్మిక గురువు నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయం ఎందుకు నిర్మించావు? అంటే ఆయన చాలా విచిత్రమైన సమాధానాలు చెబుతుంటాడు. 

దేవుళ్లందరిలో అత్యంత శక్తివంతుడైన శివుడిని ఏలియన్లే భూమ్మీదకి పంపించారంటాడు లోగనాథన్. అంతేకాకుండా తాను ఏలియెన్లతో మాట్లాడానని చెప్పే లోగనాథన్.. వాళ్ల అనుమతి తీసుకునే ఈ ఆలయాన్ని నిర్మించానని చెబుతున్నాడు. ముఖ్యంగా, రాబోయే ప్రకృతి వైపరీత్యాలు, ప్రపంచ విపత్తుల నుంచి మానవాళిని కాపాడగలిగే అపరిమిత శక్తి ఏలియన్లకి మాత్రమే ఉందని.. అందుకే ఆ ఏలియన్ దేవుడిని పూజించడం తప్పనిసరని అంటూనే.. అసలు ఏలియన్లని పూజిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తాడు.

ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి వింటే ఇంకా పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే.. ఇది సాధారణ ఆలయాల్లో గోపురంతో విశాలంగా ఉండదు. 11 అడుగుల లోతైన నేలమాళిగ అంటే అండర్‌గ్రౌండ్‌లో నిర్మించబడి ఉంటుందీ ఆలయం. లోపలికి వెళ్తే మనకి నల్లటి ఏలియన్ ప్రతిమ కనిపిస్తుంది. ఆ విగ్రహం ఎదురుగా అగస్త్యుడి విగ్రహం ఉండటం ఇంకా విచిత్రం. 

ఈ ఏలియన్ల గురించి అగస్త్య మహర్షి తన గ్రంథాలలో రాశారనేది లోగనాథన్ మాట. అంటే, మన పురాణాలతో గ్రహాంతరవాసులకు లింక్ ఉందని లోగనాథన్ నమ్ముతారు. ఈ వింత ఆలయం గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసినప్పటి నుంచి ఈ ఏలియన్ దేవుడిని చూడటానికి వందలాది మంది భక్తులు, సందర్శకులు పెద్ద సంఖ్యలోనే ఈ ఆలయానికి వస్తున్నారు. 


అయితే కొంతమంది మాత్రం.. ఈ ఆలయాన్ని జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా... ఈ ఏలియన్ టెంపుల్ అనేది భక్తి, విశ్వాసం అనే అంశాలను కొత్త కోణంలోకి తీసుకెళ్లింది. సైన్స్‌కి, స్పిరిచ్యువాలిటీకి మధ్య ఉన్న లింక్‌ని ఇది ఓ కొత్త మలుపు తిప్పింది. 

ఇండియా వీడియోలు

Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay: అమ్మ వారసుడిగా విజయ్ - అన్నాడీఎంకే కోటను కూల్చే మాస్టర్ ప్లాన్ - కాపాడుకోవడం పళనిస్వామికి కష్టమేనా?
అమ్మ వారసుడిగా విజయ్ - అన్నాడీఎంకే కోటను కూల్చే మాస్టర్ ప్లాన్ - కాపాడుకోవడం పళనిస్వామికి కష్టమేనా?
Breaking News: చెప్పులు మోసినోళ్లకే కాంగ్రెస్‌లో పదవులా? ఎంపీ రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు!
చెప్పులు మోసినోళ్లకే కాంగ్రెస్‌లో పదవులా? ఎంపీ రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు!
Breaking News: మే 21న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం మరోసారి వాయిదా
మే 21న జరగాల్సిన కేఆర్‌ఎంబీ సమావేశం మరోసారి వాయిదా
Falta ByPoll: ఫాల్టా ఉపఎన్నికలో చేతులెత్తేసిన తృణమూల్ అభ్యర్థి - పోలింగ్‌కు ముందే బీజేపీ విజయం
ఫాల్టా ఉపఎన్నికలో చేతులెత్తేసిన తృణమూల్ అభ్యర్థి - పోలింగ్‌కు ముందే బీజేపీ విజయం

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!
Thalapathy Vijay CM: రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
NTR Neel Glimpse: 'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
MS Dhoni IPL Future: ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
Embed widget