Oh Bhama Ayyo Rama Teaser : ఇదేం 'బొమ్మరిల్లు' సినిమా కాదు రక్త చరిత్ర - అమ్మాయిలను నమ్మొద్దు బాబోయ్.. 'ఓ భామ అయ్యో రామ' టీజర్ చూశారా..
Oh Bhama Ayyo Rama Teaser : సుహాస్, మాళవిక మనోజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామా'. ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ హిలేరియస్‌గా ఉంది.

Suhas's Oh Bhama Ayyo Rama Teaser Unvieled: యంగ్ హీరో సుహాస్ మరోసారి అందమైన ప్రేమ కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. 'ఓ భామ అయ్యో రామ' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. తాజాగా మేకర్స్ మూవీ టీజర్‌ని విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా, క్యూరియాసిటీని పెంచేలా ఉంది.
'ఓ భామ అయ్యో రామ' మూవీ టీజర్ రిలీజ్
టాలీవుడ్ హీరో సుహాస్ గత కొంతకాలంగా కాన్సెప్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న 'ఓ భామ అయ్యో రామ' అనే మూవీ ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ టీజర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మొదట్లోనే అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్‌తో హీరో హీరోయిన్ ఎంట్రీని చూపించారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కోసం కేఫ్‌లో వెయిట్ చేస్తుండగా, మరోవైపు ఆమె ఇంకో వ్యక్తి చెంప పగలగొట్టడం, దానికి సుహాస్ ఇచ్చిన రియాక్షన్ ఫన్నీగా ఉన్నాయి. "మీరేంటి ఇక్కడ ?" అని సుహాస్ అడగ్గా... "హా నీకు ప్రపోజ్ చేద్దామని" అని హీరోయిన్ సమాధానం చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది.
అలాగే ముసలి ఇదిగో నా హీరో... నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఇతన్నే... నా హస్బెండ్ అతనికి కాళ్లు లేవు... మనదేం బొమ్మరిల్లు సినిమా కాదు రక్త చరిత్ర..." అంటూ హీరోయిన్ చెప్పే డైలాగు, వాడికి హీరో ఇచ్చే ఎక్స్ప్రెషన్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచాయి. ఇక చివర్లో హీరోయిన్ ఫైటింగ్ సీన్స్, పృథ్వీరాజ్ సీరియస్ రియాక్షన్, ఓ సీన్ లో అలీ ఉండడం ఆసక్తికరంగా ఉంది. టీజర్ చివర్లో సుహాస్ "బాబూ అమ్మాయిలని నమ్మొద్దు బాబూ... అనుభవించి మరీ చెప్తున్నా బాబూ" అంటూ చెప్పే సీన్ మరో హైలెట్. టీజర్ కట్ అద్భుతంగా ఉంది. అలాగే అందులోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
A cute love tale of an Eccentric Bhama & an Innocent Rama 👩❤👨#OBARTeaser Out Now❤🔥
— Aditya Music (@adityamusic) March 24, 2025
— https://t.co/BNtgy1N87U#OhBhamaAyyoRama In Cinemas THIS SUMMER 2025⛱💘@ActorSuhas #MalavikaManoj @anitahasnandani @NenuMeeRamm @radhanmusic #HarishNalla @maniDop @PradeepTallapu… pic.twitter.com/HLYxyl9AcI
మూవీ రిలీజ్ ఎప్పుడు?
టీజర్‌ని చూశాక ఇదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనే విషయం స్పష్టంగా అర్థంఅవుతోంది. 'ఓ భామ అయ్యో రామ' మూవీలో సుహాస్ హీరోగా నటిస్తుండగా, మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్ హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఆమెకు ఇదే ఫస్ట్ తెలుగు సినిమా కావడం విశేషం. ఇందులో అలీ, బబ్లూ పృథ్వీరాజ్, రవీందర్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోదాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ మూవీని రిలీజ్ చేయబోతోంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయబోతున్నారు.





















