అన్వేషించండి

Singer Chinmayi : అయోధ్యకు రేపిస్టులా? - ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి

Singer Chinmayi : అత్యాచార కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపు అయోధ్య సందర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యారు.

Singer Chinmayi Reaction On Asaram Bapu Visits Ayodhya Mandir : చిన్మయి శ్రీపాద... పరిచయం అక్కర్లేని పేరు. సింగర్‌గా మంచి పాటలు పాడడమే కాకుండా... మహిళల సమస్యలు, క్యాస్టింగ్ కౌచ్, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన గళం వినిపిస్తుంటారు. రీసెంట్‌గా మహిళల డ్రెస్సింగ్ విషయంలో శివాజీ కామెంట్స్‌పైనా ఆమె రియాక్ట్ అయ్యారు. తాజాగా... మరో అంశంపై ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేస్తూ వీడియోస్ రిలీజ్ చేశారు.

అత్యాచార దోషి అయోధ్య సందర్శనపై...

ఆధ్యాత్మిక వేత్త ఆశారాం బాపు అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఆశారాం అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. రామ్ లల్లాను దర్శించుకుని సరయూ నది ఒడ్డున ఆరతిలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

అత్యాచార కేసులో దోషిగా ఉండి బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి పవిత్ర స్థలంలోకి ఎలా వెళ్తారంటూ కొందరు కామెంట్స్ చేశారు. దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఇన్ స్టాలో వీడియోస్ రిలీజ్ చేశారు. 

అప్పుడలా... ఇప్పుడెందుకిలా?

కొన్నాళ్ల ముందు బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ మధురకు ఓ ఈవెంట్‌కు వెళ్తే ఆమె రాకూడదంటూ అక్కడ ఉన్న పూజారులు నిరసన తెలిపారని గుర్తు చేశారు చిన్మయి. ఆ ఈవెంట్‌నే క్యాన్సిల్ చేయించారని చెప్పారు. 'కానీ ఇవాళ అత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి అయోధ్యను సందర్శించారు. ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదా?. అదీ కాక సదరు వ్యక్తి అనారోగ్యమంటూ బెయిల్‌పై ఉన్నారు. అయోధ్యకే వెళ్లేంత హెల్తీగానే ఉన్నారు కదా?

జైలుకు పంపెయ్యొచ్చు కదా. కానీ అలా చేయలేదు. ఇప్పుడు ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ కానీ, ఏ భక్తులు కానీ రియాక్ట్ కాలేదు. అందరూ మూసుకుని కూర్చుంటారు.' అని అన్నారు.

Also Read : దేవిశ్రీ ప్రసాద్‌కు బదులుగా తమన్ - ఉస్తాద్ భగత్ సింగ్ బీజీఎంపై డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్షన్

అలా చెప్పడం తప్పేంటి?

'మీ అందరికీ మీ బాబాజీలు రేప్ చేస్తే పర్వాలేదు. మీ పూజారులు రేప్ చేస్తే పర్వాలేదు. లైంగిక వేధింపులు చేసే వారికి వారు సపోర్ట్ చేస్తే పర్వాలేదు. నా లాంటి ఎవరో ఒకరు సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడితే మీ అందరికీ కోపం వస్తుంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొనే వారిలో పొటిలికల్ లీడర్స్, పేరొందిన వారు ఉండొచ్చు. వారికి దండలు వేస్తారు. మీది రేప్ కల్చర్ అని చెప్పడంలో తప్పేముంది.' అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

దీంతో పాటే చైనాలో ముగ్గురు మైనర్ రేపిస్టులకు బహిరంగంగా శిక్ష విధించారని... ఇండియాలో రేపిస్టులు ఆలయాలను సందర్శిస్తున్నారంటూ ఫోటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోస్ వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిపై చిన్మయికి సపోర్ట్  చేస్తూ పోస్టులు పెడుతున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget