HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
HIT 3 Song: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'హిట్ 3'. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. అద్భుతమైన మ్యూజిక్‌తో లవ్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Nani's HIT 3 Movie First Song Prema Velluva Unvieled: నేచురల్ స్టార్ నాని (Nani), ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబోలో అవెయిటెడ్ మూవీ 'హిట్ 3: ది థర్డ్ కేస్' (HIT 3). తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను టీం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అర్జున్ సర్కార్‌గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనుండగా.. సమ్మర్ స్పెషల్‌గా మే 1న థియేటర్లలోకి రానుంది.
లవ్ సాంగ్ అదిరిపోయిందిగా..
క్రైమ్ థ్రిల్లర్ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లవ్ సాంగ్ అదిరిపోయింది. 'పగలే నా వైపుకి నడిచే కలవా.. పడుతూ ఎగిరే అలవా.. ప్రేమ వెల్లువ..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు మిక్కీ జే మేయర్ స్వరాలు అందించగా.. సిద్ శ్రీరామ్, నూతన మోహన్ పాడారు. కూల్ వెదర్‌లో లవ్ మూడ్‌లో అద్భుతమైన సంగీతంతో సాగే పాట ఆద్యంతం అలరిస్తోంది.
బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ..
బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'హిట్' నుంచి వస్తోన్న మూడో చిత్రం 'హిట్ 3: ది థర్డ్ కేస్' (Hit 3). హిట్‌లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ నటించి మెప్పించగా.. హిట్ 3లో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. నాని మాస్ యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ డీసెంట్ ఫ్యామిలీ మెన్‌గా కనిపించిన నాని.. ఈ సినిమాలో మాస్ రెబల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండడంతో ఆసక్తి రేపుతోంది. తొలి 2 సిరీస్‌ల్లో ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్వెస్టిగేషన్ జరగ్గా.. హిట్ 3 కేసు ఇన్వెస్టిగేషన్ దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. నాని యాక్షన్ చూడాలంటే మే 1 వరకూ ఆగాల్సిందే.
ఓటీటీ డీల్.. వైరల్..
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా రూ.54 కోట్లకు హక్కులను సొంతం చేసుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రిలీజ్ కానుంది. మరోవైపు.. నాని నిర్మాతగా వ్యవహరించిన 'కోర్ట్' మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సంచలన విజయంతో రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
అలాగే, నాని దసరా ఫేం శ్రీకాంత్ ఓదెలతో 'ది ప్యారడైజ్' మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, నాని లుక్ వేరే లెవల్‌లో ఉంది. 'THE RAW STATEMENT' పేరుతో విడుదలైన గ్లింప్స్‌లో నాని యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. ఈ సినిమా 1960 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుండగా.. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

