IPL 2025 Points Table: పదో స్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ KKR, తొలి స్థానంలో ఉన్నది ఎవరంటే..
IPL Points Table: ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ట్రోఫీ నెగ్గని జట్లు 4 టాప్ 5లో ఉన్నాయి. ఐదేసి ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ 6, 7 స్థానాల్లో నిలిచాయి.

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ()లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో సోమవారం రాత్రి వాంఖేడెలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. దాంతో ఈ సీజన్‌లో ప్రతి జట్టు విజయాల ఖాతా తెరిచినట్లు అయింది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతాను ముంబై బౌలర్లు ఇబ్బంది పెట్టారు. దాంతో సీజన్లో అతి తక్కువ స్కోరు నమోదు అయింది. కొత్త కుర్రాడు అశ్వనీ కుమార్ 4 వికెట్లతో రాణించి కేకేఆర్ జట్టును దెబ్బకొట్టడంతో 16.2 ఓవర్లలో 116 పరుగులకు డిఫెండింగ్ ఛాంపియన్ ఆలౌటైంది. ముంబై జట్టు 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తద్వారా సీజన్లో తొలి విజయాన్ని చివరి జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ లో 12 మ్యాచ్‌ల తరువాత చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. 4 పాయింట్ల ఉన్నా 2.27 మెరుగైన రన్‌రేటుతో ఆర్సీబీ టాప్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గినా 1.32 రన్ రేటు కారణంగా రెండో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ జట్లు రెండు మ్యాచ్‌లాడగా ఒకటి నెగ్గి, ఒకటి ఓడాయి. లక్నో, గుజరాత్, పంజాబ్ జట్లు వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఐపీఎల్ నెగ్గిన జట్టు గుజరాత్ మాత్రమే టాప్ 5 లో ఉంది.
| టీమ్ | మ్యాచ్‌లు | గెలుపు | ఓటమి | టై | పాయింట్లు | రన్ రేట్ | |
| 1 | Royal Challengers Bengaluru | 2 | 2 | 0 | 0 | 4 | 2.266 |
| 2 | Delhi Capitals | 2 | 2 | 0 | 0 | 4 | 1.32 |
| 3 | Lucknow Super Giants | 2 | 1 | 1 | 0 | 2 | 0.963 |
| 4 | Gujarat Titans | 2 | 1 | 1 | 0 | 2 | 0.625 |
| 5 | Punjab Kings | 1 | 1 | 0 | 0 | 2 | 0.55 |
| 6 | Mumbai Indians | 3 | 1 | 2 | 0 | 2 | 0.31 |
| 7 | Chennai Super Kings | 3 | 1 | 2 | 0 | 2 | -0.771 |
| 8 | Sunrisers Hyderabad | 3 | 1 | 2 | 0 | 2 | -0.871 |
| 9 | Rajasthan Royals | 3 | 1 | 2 | 0 | 2 | -1.112 |
| 10 | Kolkata Knight Riders | 3 | 1 | 1 | 0 | 2 | -1.43 |
- 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో 6 స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్ లలో రెండు ఓడిపోయింది. KKR మీద నెగ్గడంతో ఏకంగా 10 నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. 0.31 రన్ రేటుతో బెటర్ పొజిషన్ కు వచ్చింది.
- 5 ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గి, 2 మ్యాచ్ లు ఓడిపోయింది. -0.771 రన్ రేటుతో 7వ స్థానంలో నిలిచింది.
- ఒక ట్రోఫీ సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గగా, రెండు మ్యాచ్ లలో ఓడింది. -0.871 రన్ రేటుతో 8వ స్థానంలో ఉంది.
IPL 2025 POINTS TABLE. 📈
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2025
- Defending Champions KKR at No.10. pic.twitter.com/5g2ssU0K7S
- తొలి ఐపీఎల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మూడు మ్యాచ్ లాడి ఒకదాంట్లో నెగ్గి, రెండింట్లో ఓడిపోయింది. -1.112 రన్ రేటుతో 9వ స్థానానికి పడిపోయింది.
- మూడు ఐపీఎల్ ట్రోపీలు నెగ్గిన, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కోల్ కతా జట్టు 3 మ్యాచ్ లలో ఒకటి నెగ్గి, 2 మ్యాచ్‌లు ఓడింది. -1.43 రన్ రేటుతో 6వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది.
Mumbai Indians outclass KKR with an 8-wicket win, sealing the game with 7.1 overs to spare! 💙
— Babulal Jyani (@BabulalJyani14) March 31, 2025
- A commanding performance by MI. Mumbai Indians move to 6th position in points table 🔥💙#IPL #IPL2025 #MIvsKKR #KKRvsMI pic.twitter.com/NlWeyWk1Mv





















