IPL 2025 Sangakkara Vs Maiaika Arora: సంగక్కరతో మలైకా డేటింగ్..! తాజాగా స్టేడియంలో దర్శనమిచ్చిన జంట.. సోషల్ మీడియాలో వైరల్
మలైకాపై తాజాగా ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది. సంగక్కరతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఆమె నేరుగా స్పందించక పోవడంపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Malaika Arora News: ఆదివారం రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మద్య జరిగిన మ్యాచ్ లో ఒక ఫొటో వైరల్ గా మారింది. ఆ మ్యాచ్ కు శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ మాజీ హెడ్ కోచ్, ప్రస్తుత డైరెక్టర్ కుమార సంగక్కర హాజరయ్యాడు. అయితే అతని పక్కనే నటి, ఐటెమ్ గర్ల్ మలైకా ఆరోరా కనిపించడం అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. అసలు మలైకా, సంగక్కర పక్కన కూర్చుని మ్యాచ్ ఎందుకు చూస్తోందని పలువురిలో సందేహాలు లేవనెత్తాయి. అసలు వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరగుతుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేసి, లైకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు.. అసలు మలైకా సంగక్కరతో మ్యాచ్ ఎందుకు చూస్తోందని, అతని పక్కన ఎందుకుందని ఆరా తీస్తున్నారు. ఇక ప్రస్తుతం మలైకా సింగిల్ గానే ఉంది. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడిని వివాహం చేసుకుని, కొంతకాలం తర్వాత విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది. దాదాపు ఆరేళ్పాటు అతనితో చెట్టాపట్టాలు వేసుకుని గడిపింది.
Malika Arora and Kumar Sangakkara in relationship ? #CSKvsRR #IPL2025 pic.twitter.com/cts0QHea76
— Hitman 45 (@Hitman450745) March 30, 2025
గతేడాది బ్రేకప్..
దాదాపు ఐదేళ్లకుపైగా డేటింగ్ చేసిన ఈ జంట.. ఏ ఈవెంట్ జరిగినా, ఇద్దరు కలిసి హాజరయ్యేది. నిజానికి వయసులో అర్జున్ కంటే కొంచెం పెద్దదైన మలైకా.. అతనితో డేటింగ్ చేయడం చాలామంది రుచించలేదు. ఏదేమైనా ఇద్దరి మధ్య డేటింగ్ ముగిసిందని పరోక్షంగా గతేడాది అర్జున్ వెల్లడించాడు. గత అక్టోబర్ లో తన సినిమా సింగమ్ అగైన్ సందర్బంగా తను సింగిల్ గానే ఉన్నట్లు పేర్కొన్నాడు. దీంతో వీరిద్దరి బ్రేకప్ పై స్పష్టత వచ్చింది. అయితే దీనిపై ఇప్పటివరకు మలైకా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఖండించిన సన్నిహిత వర్గాలు..
ఇక కుమార సంగక్కరతో డేటింగ్ వార్తలను మలైకా అరోరా సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఇలాంటి బేస్ లెస్ ఆరోపణలు చేయవద్దని హితవు పలికాయి.కేవలం పక్కన కూర్చుని మ్యాచ్ చూసినంత మాత్రాన ఇలాంటి పుకార్లు పుట్టించడం సరికాదని, దీనిపై ఆమె వివరణ కూడా తీసుకోవాలని పేర్కొన్నాయి. ఏదేమైనా ఇన్నాళ్లుగా లేనిది ఈ ఐపీఎల్లో సంగక్కరతో కలిసి మలైకా దర్శనమివ్వడంపై పులువురు సందేహాలు లేవనెత్తుతున్నారు. అర్జున్ కపూర్ తో బ్రేకప్ పై స్పష్టత ఇవ్వకుండా, సంగక్కర ఇష్యూపై ఇలా పరోక్షంగా స్పందించడం కన్నా, నేరుగా ఆమె క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు. మరోవైపు సంగక్కర మాత్రం రాయల్స్ తాజా ప్రదర్శనపై ఫుల్ హేపీగా ఉన్నాడు. రెండు వరుస ఓటముల తర్వాత మాజీ చాంపియన్ రాయల్స్ ఈ సీజన్ లో తొలి విక్టరీని సాధించింది. ముఖ్యంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ , ఫీల్డింగ్ లోనూ రాయల్స్ సత్తా చాటా ఉత్కంఠ భరిత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మలైకా అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తోంది.




















