అన్వేషించండి

 IPL 2025 Nitish Rana Comments: మ్యాచ్ ఆడొద్దనుకున్నా.. ద్ర‌విడ్ తో మాట్లాడాను.. విధ్వంస‌క ఫిఫ్టీ చేశా.. నితీశ్ రాణా వెల్ల‌డి

అనారోగ్యంతో మ్యాచ్ ఆడటం కూడా డౌట్ గానే అనిపించింద‌ని, ద్ర‌విడ్ తో మాట్లాడిన త‌ర్వాత ఆడిన‌ట్లు నితీశ్ తెలిపాడు. త‌న‌ను న‌మ్మి, బాధ్య‌త అప్ప‌గించడంతో, ఎలాగైనా నెర‌వేర్చాల‌ని భావించాన‌ని వెల్ల‌డించాడు. 

RR Head Coach Rahul Dravid Imapact: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ నితీశ్ రాణా.. చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో రెచ్చిపోయిన సంగ‌తి తెలిసిందే. త‌నకు అల‌వాటైన మూడో నెంబ‌ర్లో బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవ‌లం 36 బంతుల్లోనే 81 ప‌రుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్స‌ర్లు, ప‌ది ఫోర్లు ఉండ‌టం విశేషం. గువాహ‌టిలో ఆదివారం జ‌రిగిన ఈ మ్యాచ్ లో త‌నే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నాడు. దీంతో రెండు వ‌రుస ఓట‌ముల త‌ర్వాత చెన్నైని మ‌ట్టిక‌రిపించి, ఈ సీజ‌న్ లో బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు జ‌రిగిన ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తాజాగా నితీశ్ పంచుకున్నాడు. నిజానికి మ్యాచ్ కు ముందు త‌న‌కు ఒంట్లో బాగోలేక‌పోవ‌డంతో ప్రాక్టీస్ సెష‌న్ ను స్కిప్ చేసిన‌ట్లు తెలిపాడు. ఈ విష‌యం తెలుసుకున్న హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్.. త‌న‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన‌ట్లు పేర్కొన్నాడు. అనంత‌రం చెన్నైపై స‌త్తా చాటి విధ్వంస‌క‌ర ఫిఫ్టీ చేశాడు. 

రాహుల్ ఏం చెప్పాడంటే..
ఇక ఈ సీజ‌న్ లో రాయ‌ల్స్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ కాస్త మారింది. రెగ్యుల‌ర్ గా మూడో నెంబ‌ర్లో ఆడే నితీశ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. అయితే విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో ద్ర‌విడ్ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి, చెన్నైతో మ్యాచ్ లో మూడో నెంబ‌ర్లో బ్యాటింగ్ కు దిగాల‌ని సూచించిన‌ట్లు తెలిపాడు. దీంతో త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా, చెన్నైపై బ‌రిలోకి దిగిన‌ట్లు పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ కు త‌న దైన శైలిలో హోం వ‌ర్క్ చేసి, స్టేడియానికి త‌గిన విధంగా షాట్ల‌తో సిద్ధ‌మైన‌ట్లు పేర్కొన్నాడు. దీంతో త‌గిన ఫ‌లితం సాధించిన‌ట్లు పేర్కొన్నాడు.  

గ‌త కొంత‌కాలంగా సాధ‌న‌..
నిజానికి గ‌త కొంత‌కాలంగా ప‌రిస్థితులు, స్టేడియాల‌కు త‌గిన విధంగా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు నితీశ్ తెలిపాడు. దీంతో చాలామ‌టుకు సానుకూల ఫ‌లితాల‌ను సాధిస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇక ఈ సీజ‌న్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ ల్లో ఈ విధంగానే ప్రిపేర‌య్యాన‌ని, అయితే కాలం క‌లిసి రాలేద‌ని పేర్కొన్నాడు. ఇక ద్ర‌విడ్ తో మాట్లాడిన త‌ర్వాత త‌న‌లో ఆత్మ‌విశ్వాసం పెరిగింద‌ని, మూడో నెంబ‌ర్లో ఆడ‌టం కూడా క‌లిసొచ్చింద‌ని అభిప్రాయ ప‌డ్డాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయినా, తాము ఎంతో నేర్చుకున్నామని, సీజన్ ఆరంభంలోనే ఇలా జరగడం కొత్త అనుభవమని పేర్కొన్నాడు.  ఇక ఉత్కంఠ భ‌రితంగా జ‌రిగిన మ్యాచ్ లో కేవ‌లం ఆరు ప‌రుగుల తేడాతో గెలిచి, ఈ సీజ‌న్ లో త‌లి విజ‌యాన్ని రాయ‌ల్స్ సాధించింది. 

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget