HCU lands Fact: హెచ్‌సీయూ భూములపై ఊహించని ట్విస్ట్.. సంచలన డాక్యుమెంట్ బయటపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో HCU భూముల వివాదంలో ఊహించని ట్విస్ట్ నెలకొంది. భూమికి భూమి మాత్రమే తీసుకున్నామంటూ సంచలన డాక్యుమెంట్ ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ మరో సంతకం చిక్కింది.

HCU lands News | తెలంగాణలో హెచ్ సీయూ భూముల వివాదం టీవి సీరియల్ ను మించిపోయేలా రోజుకో ట్విస్ట్ , ఊహించని మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలో సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిపై గత కొంతకాలంగా జరుగుతున్న రచ్చ అందిరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను అమ్మేయాలని , కాంక్రీట్ జంగిల్ గా మార్చేయాలని చూస్తోందంటూ విద్యార్దులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నిరసనలు ,ఆందోళనలతో యూనివర్సిటీ అట్టుడుకుతోంది.
హెచ్ సీయూకు ఎటువంటి సంబంధం లేదు
ఆ భూములపై హెచ్ సీయూకు ఎటువంటి సంబంధం లేదు, అవి ప్రభుత్వ భూములంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు ఆ భూమల్లో చెట్లను తొలగించి, నిర్మాణాలు చేపట్టేందుకు, ఐటీ రంగాన్ని అభివృద్ది చేసేందుకు , ఆ భూములు అమ్మడం ద్వారా వచ్చే 25వేల కోట్ల రూపాయాల ఆదాయంతోొ ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు సిద్దమైయ్యింది. ఈ నేధ్యంలో అడ్డుకోబోయిన విద్యార్దులను అరెస్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ మాత్రం ఆ భూమలపై సర్వే జరగలేేదు. అవి ప్రభుత్వ భూములు అని ఎలా నిర్దారిస్తారని ప్రశ్నిస్తోంది.ఇలా విద్యార్ది సంఘాలు, హెచ్ సీయూ ఓ వైపు, తెలంగాణ ప్రభుత్వం మరోవైపు. 400 ఎకరాల భూములు మావంటే మావంటూ గత కొద్ది రోజులుగా వివాదం తారా స్దాయికి చేరింది. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని దోషిగా బోనులో నిలబెట్టి ,విమర్శలతో చెలరేగిపోతున్నాయి.
హెచ్ సీయూ , అప్పటి ప్రభుత్వం మధ్య భూ బదలాయింపులు
తాజాగా కీలక డాక్యుమెంట్ ను బయటపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. 2004లో అప్పటి ఉమ్మడి ఏపి ప్రభుత్వం హెచ్ సీయూలోని ప్రస్తుతం వివాదంగా మారిన 400 ఎకరాల భూములను ప్రభుత్వానికి హెచ్ సీయూకు అప్పగించినట్లు , అప్పటి రిజిస్ట్రార్ సంతకం చేసి ఉన్న కీలక డాక్యుమెంట్ ను బయటపెట్టింది. అయితే హెచ్ సీయూ నుండి ఈ భూములు తీసుకున్నందుకు ప్రతిగా అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం హెచ్ సీయూకు గోపనపల్లిలోని సర్వే నెంబర్ 36లో 192 ఎకరాలు, సర్వేనెంబర్ 37లో 205 ఎకరాలు మొత్తంగా 397 ఎకరాలు కేటాయించినట్లు డాక్యుమెంట్ బయటపెట్టింది. ఇలా హెచ్ సీయూ , అప్పటి ప్రభుత్వం మధ్య భూ బదలాయింపులు జరిగినట్లు తాజాగా వెలుగుచూసిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమవుతోంది.
ఎవరెన్ని విమర్శలు చేసినా ,విద్యార్దులు ఎంతలా నిరసనలు చేిసినా ముందేకే వెళతాం. ఆ భూములను ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అభివృద్ది చేసితీరుతాం అంటోంది తెలంగాణ సర్కార్. తాజాగా బయటపెట్టిన డాక్యుమెంట్ తో ప్రభుత్వం తీరును సమర్దించేందుకు మరో ఆయుధంగా దొరికిందని చెప్పవచ్చు. అయితే ప్రతిపక్షాలు మాత్రం వన్యప్రాణులను హతమార్చి , కాంక్రీట్ జంగిల్ ను నిర్మించడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి. యూనివర్సిటీ భూములపై మొదట సర్వే జరగాలి, అలా సర్వే జరపకుండా మీ ఇష్టానుసారం ఎలా భూములను స్వాధీనం చేసుకుంటారని హెచ్ సీయూ ప్రశ్నిస్తోంది. మొత్తంగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్దుల ఆందోళనలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అలా అని ప్రభుత్వం కూడా ఆ దిశగా విద్యార్దులను ఒప్పించి, ముందుకెళ్లే పరిస్దితులు కనిపించడంలేదు. భూమిపై హక్కులు ఉన్నా, అభ్యంతరాలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 





















