KTR about HCU Lands: హెచ్‌సీయూ భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
హెచ్ సీయూ భూముల వివాదంపై కేటీఆర్ స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో భూముల కేటాయింపుల ఆపాలని ,పర్యావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నరాహుల్ గాంధీ హెచ్ సీయూ విషయంలో ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

తొలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కేటీఆర్.దేశవిదేశాలల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన అనేమందిని తీర్చిదిద్దిన హెచ్ సీయూ దేశానికి తలమానికంగా మారిందని, ఇప్పుడు వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలతో అక్కడున్న చెట్లను, జంతువులను, చంపి, వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఎందుకు ఇంత వేగంగా భూముల కబ్జాకు ఎందుకు ఇంత ఆరాటపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగి, ఓ కాంక్రీట్ జంగల్‌గా మారింది. భారతదేశంలోని ఏ నగరంలో అంత తక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు.
కోట్లాది చదరపు అడుగుల నివాస గృహాలు నిర్మాణం అవుతున్నాయి.వెస్ట్ హైదరాబాద్‌కి ఊపిరి ఇచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టుప్రక్కల ప్రాంతాలే కీలకంగా ఉన్నాయిని కేటీఆర్ అన్నారు. యూనివర్సిటీలో 400 ఎకరాలను అమ్మడం వల్ల జరిగే పర్యావరణ నష్టం, ప్రభావంపైన మొదట అధ్యయనం చేయాలి డిమాండ్ చేశారు కేటీఆర్. 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించింది అప్పటి ప్రభుత్వం.కేవలం స్టేడియాలు క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఈ భూముల వివాదంపై 21 సంవత్సరాల తర్వాత కేసు తేలింది, కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే ఆ భూములను అమ్మి 30 వేల కోట్ల రూపాయలను పొందేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం అప్పులు తేవడం అనే అజెండాపైనే రాష్ట్రాలన్ని పాలిస్తున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలలో కడతామని చెప్పి ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి , ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి నూతన నగరం కడతామంటున్నారు.ఇప్పటికే వేల ఎకరాల భూమి మీకు అందుబాటులో ఉన్నప్పుడు 400 ఎకరాలను అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. 45,000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులో వచ్చే సమయంలో కేవలం 400 ఎకరాలపైన ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాప్రశ్నించారు కేటీఆర్.హెచ్ సీయూలో గత కొంత కాలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ది సంఘాలు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని, అడ్డొచ్చిన విద్యార్దులను , మహిళలను లాగిపడేసి, దుస్తులను చించి, దుర్మార్గంగా వ్యవహిరిస్తున్నారని మండిపడ్డారు.
భూముల వివాదంపై రాహుల్ కేటీఆర్ సూటి ప్రశ్నలు..
హెచ్ సీయూలో బుల్డోజర్లు చేస్తున్న విధ్వంశానికి వన్యప్రాణులు అరుస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తలేదా రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపైన పిల్ వేయడం జరిగిందన్న కేటీఆర్ , హైకోర్టు ఆదేశాల కన్నా ముందే ఈ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు. గతంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లారు, కానీ ఇక్కడి విద్యార్థులపైన ఇన్ని అరాచకాలు జరుగుతున్న పర్యావరణంపైన ఇంత అక్రమంగా తమ సొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.ఇదే రాహుల్ గాంధీ గతంలో ముంబై ఆరాయి అడవులపై జాతీయస్థాయిలో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌లో హస్దేయో అడవులను ఇతరులకు కేటాయించకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ భవిష్యత్తును , పిల్లల భవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెడుతుంటే మౌనంగా ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు మా పార్టీ తరఫున భరోసా ఇచ్చాము.త్వరలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అడుగుతామన్నారు కేటీఆర్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడి మరీ అక్కడున్న భూములపైన కన్ను వేశారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనను రాజకీయం చేసే ఉద్దేశ్యం లేకపోవడం వల్లనే ఇన్నాళ్లు యూనివర్సిటీకి రావాలని విద్యార్దులు కోరినా రాలేదని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ రాజ్యసభలో మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చాము.
యూనివర్సిటీలో నిరసనలు తెలుపుతున్న ఇద్దరు విద్యార్దులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని, వారి ఆచూకీ బయటపెట్టాలని డిమాండ్ చేసారు. విసి అనుమతులు లేకుండా పోలీసులు క్యాంపస్ లోపలికి వెళుతున్నారు. విచ్చలవిడిగా పోలీసులను పంపించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి మానుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు యూనివర్సిటీ భూముల వివాదంపై తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

