అన్వేషించండి

Kakani Govardhan Reddy : కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం సెర్చింగ్ - హైదరాబాద్ ఇంట్లోనూ పోలీసుల నోటీసులు

Kakani: కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు.

AP Police issues notices to Kakani: మాజీ మంత్రి, నెల్లూరు వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాలేదు. నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, అమ్మకాల కేసులో ఆయన ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆయనను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆదివారం ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఆయన హాజరు కాలేదు. 

మరో వైపు ఆయన కోసం నెల్లూరు పోలీసులు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లినా అక్కడ కూడా ఆయన లేరు. దీంతో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆ ఇంట్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి  బంధువుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్టు భయంతో ఆజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ మంగళవారం జరిగే అవకాశం ఉంది. ఈ లోపు పోలీసులకు కనిపిస్తే అరెస్టు చేస్తారని.. అందుకే ముందస్తు బెయిల్ వచ్చే వరకూ ఆజ్ఞాతంలో ఉండాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.                                          

కాకాణిపై నమోదు అయిన కేసు ఏమిటంటే ?

 నెల్లూరు జిల్లాలో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని.. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని  మైన్స్ అధికారులు గుర్తించారు. పోలీసులకు ఫి ర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ మంత్రి కాకాణి పేరును ఏ4గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాడు. క్వార్ట్‌జ్ అక్రమాల వ్యవహారంలో ఏ4గా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై 120బీ, 129, 220,  447, 427, 379, 506తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన శ్యాంప్రసాద్ రెడ్డి ఏ1 కాగా, ఏ2, ఏ3లుగా పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. ఏ6, ఏ8గా ఉన్న మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరు పరిచగా.. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

వైసీపీ హయాంలోనే టీడీపీ నేత సోమిరెడ్డి కేంద్ర మైనింగ్‌ శాఖకు విచారణకు ఆదేశించాలని ఫిర్యాదు చేశారు. రూ.250 కోట్లకు పైగా క్వార్ట్జ్ దోచుకుపోయారని ఫిర్యాదు చేశారు. ఆపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో కేసులో పురోగతి కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన మైనింగ్ శాఖ అధికారులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఏ4గా కాకాణి పేరు చేర్చారు. శ్యాంప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది.   హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget