MI vs KKR Match Highlights IPL 2025 | కేకేఆర్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ | ABP Desam
రెండు మ్యాచులు పూర్తైపోయాయి. ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసింది. డిఫెండింగ్ చాంఫియన్ కోల్ కతా తో హోం గ్రౌండ్ లో వాంఖడేలో జరిగిన మ్యాచ్ లో దుమ్మురేపింది ముంబై ఇండియన్స్. ముంబై కొత్త పేసర్ అశ్వని కుమార్ ప్రభజనంతో ముంబై కోల్ కతాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. అద్భుత అరంగేట్రం అశ్వనీ కూమార్
మొదటి రెండు మ్యాచుల్లో బౌలింగ్ వేసిన తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజును పక్కన పెట్టేసి పంజాబ్ కి చెందిన 23ఏళ్ల కుర్రబౌలర్ తో డెబ్యూ చేయించింది ముంబై ఇండియన్స్. తన పేరే అశ్వనీ కుమార్. పంజాబ్ కు చెందిన అశ్వనీ కుమార్ ముంబై తరపున ఐపీఎల్లో ఆడిన మొదటి మ్యాచులోనే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతాను అల్లాడించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణయం కరెక్ట్ అని ప్రూవ్ చేసేలా పిచ్ మీద పేస్ ను వాడుకుంటూ లెఫార్మ్ పేస్ బౌలింగ్ తో ఛేంజ్ ఆఫ్ వేరియషన్స్ తో కేకేఆర్ బ్యాటర్లకు పిచ్చెక్కించాడు అశ్వనీ కుమార్. కెప్టెన్ అజింక్యా రహానే, రింకూ సింగ్, మనీష్ పాండే, రస్సెల్ ను అవుట్ చేసి ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసిన తొలి భారత పేసర్ గా నిలిచాడు అశ్వనీ కుమార్. రస్సెల్ ను క్లీన్ బౌల్డ్ చేసిన బాల్ చూడాలి బ్యూటీ అసలు. చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు ఈ కుర్రోడు అయితే.
2. రఘువంశీ రమణ్ దీప్ తప్ప అంతా ఢమాల్
అశ్వనీ కుమార్ నాలుగు వికెట్లకు తోడుగా దీపక్ చాహర్ 2, బోల్ట్, పాండ్యా, విఘ్నేశ్, శాంటర్న్ తలో వికెట్ తీయటంతో కోల్ కతా ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. 1కే 1, 2కే 2, 25కి మూడు, 41 కి నాలుగు సాగిన కోల్ కతా వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. ఇంత పేక మేడలోనూ కోల్ కతా 116 పరుగులన్నా స్కోరు బోర్డు మీద పెట్టిందంటే కారణంగా కోల్ కతా బ్యాటర్లు రఘువంశీ, చివర్లో రమణ్ దీప్. రఘు 26పరుగులు చేస్తే, చివర్లో రమణ్ దీప్ 12 బాల్స్ లోనే 22 పరుగులు చేశాడు. ఫలితంగా కోల్ కతా ఘోర పతనం నుంచి కోలుకుని ముంబైకి 117 పరుగుల టార్గెట్ అన్నా ఇవ్వగలిగింది.
3. ర్యాన్ రికెల్టెన్ షో
117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రోహిత్ శర్మ అవుటైనా పెద్ద గా ఇబ్బంది పడలేదంటే రీజన్ మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టెన్. మొదటి రెండు మ్యాచుల ఫెయిల్యూర్స్ ను దాటుకుని ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడిన రికెల్టెన్ 41బంతుల్లో 4 ఫోర్లు 5సిక్సర్లతో మొత్తం 62పరుగులు చేసి ముంబై విజయాన్ని ఈజీ చేసేశాడు.
4. సూర్య కేమియో
కొట్టాల్సింది తక్కువ లక్ష్యమే అయినా చాన్నాళ్ల తర్వాత ఊపులో కనిపించిన సూర్య కుమార్ యాదవ్ 9 బంతుల్లో నే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27పరుగులు బాదాడు. అద్భుతమైన సిక్సర్ తో విన్నింగ్ షాట్ కొట్టి ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీని ముంబైకి అందించాడు సూర్యా భాయ్.
5. ఆఖరు నుంచి ఆరుకు
కేకేఆర్ విసిరిన టార్గెట్ ను 13 ఓవర్లలోనే ఫినిష్ చేసిన ముంబై భారీగా రన్ రేట్ ను పెంచుకుంది. మొట్టమొదటి విజయానికే ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఝాయ్ మని ఎగబాకింది. ముంబై మీద ఓడిపోయిన కేకేఆర్ ముంబైని పైకి లాగి దాని ఆఖరి స్థానాన్ని ఆక్రమించుకుని లాస్ట్ ప్లేస్ లో సెటిలైంది ప్రస్తుతానికి.





















