Amaravati ki Aahwanam Movie : 'అమరావతికి ఆహ్వాణం' ఫస్ట్ లుక్ - ఫుల్లుగా భయపెట్టేశారుగా!
Amaravati ki Aahwanam Movie : శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న హర్రర్ మూవీ 'అమరావతికి ఆహ్వాణం' మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.

Amaravathiki Aahwanam First Look Unvieled: హార్రర్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతున్న తరుణంలో 'అమరావతికి ఆహ్వాణం' అనే మరో హారర్ థ్రిల్లర్ మూవీ తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి మేకర్స్ మూవీపై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.
'అమరావతికి ఆహ్వాణం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రస్తుతం హార్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి డిమాండ్ ఉన్న ఇలాంటి స్టోరీలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాల సక్సెస్సే దీనికి నిదర్శనం. ఉత్కంఠ భరితమైన కథ, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అంశాలు ఉండాలే గానీ హార్రర్ సినిమాల దూకుడుకు అడ్డుండదు. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో, సీట్ ఎడ్జ్ సస్పెన్స్ అంశాలతో రూపొందుతోంది హర్రర్ థ్రిల్లర్ మూవీ 'అమరావతికి ఆహ్వాణం'.
ఈ మూవీలో 'అక్కడొకడుంటాడు' ఫేమ్ శివ కంఠమనేని హీరోగా నటిస్తుండగా, ధన్య బాలకృష్ణ, సుప్రీత, ఎస్తేర్, హరీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ రైటర్ డైరెక్టర్ జీవీకే 'అమరావతికి ఆహ్వాణం' మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మేకర్స్.
బ్లాక్ థీమ్‌తో ఇంటెన్సివ్‌గా..
టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన 'అమరావతికి ఆహ్వాణం' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో కంప్లీట్‌గా బ్లాక్ థీమ్ వాడి స్పెషల్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేశారు. లీడ్ యాక్టర్స్ అందరూ బ్లాక్ డ్రెస్‌లో, సీరియస్ లుక్‌లో దర్శనం ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. పైగా ఇందులో ఫేస్‌లు పూర్తిగా రివీల్ కాకుండా పోస్టర్‌ను డిజైన్ చేశారు. అందరి కళ్లల్లోనూ ఒకే రకమైన ఇంటెన్సిటీ కనిపించడం సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి ఓ మంచి హారర్ థ్రిల్లర్ మూవీని తెరపై చూడబోతున్నాము అన్న అనుభూతిని ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు.
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కెఎస్.శంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పద్మనాభం భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండగా, సాయిబాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇక సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ని అంజి మాస్టర్ తెరకెక్కించారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతోంది చిత్ర బృందం. అలాగే మూవీ రిలీజ్ డేట్‌ని కూడా మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఫస్ట్ లుక్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ ఇంటెన్స్ హార్రర్ డ్రామాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రానుంది అన్నది తెలియాలంటే మీకు నుంచి మూవీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ అండ్ సీ. ఇక ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ల గురించి ప్రేక్షకులు ఎదురు చూపులు మొదలయ్యాయి.





















